Saturday, May 17, 2025

ఇండియా కూటమి భవిష్యత్ అగమ్యగోచరం

- Advertisement -
- Advertisement -

అంగీకరించిన కాంగ్రెస్ అగ్రనేత చిదంబరం
మరో పక్క బీజేపీ బలమైన శక్తిగా ఉందని వ్యాఖ్య

న్యూఢిల్లీ: కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమి భవిష్యత్ (India alliance future) అంత అద్భుతంగా లేదని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదబరం అంగీకరించారు. 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ హెచ్చరిక చేశారు. మరో నాలుగేళ్లలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలనాటికి బీజేపీ తన ఆధిపత్యాన్ని పటిష్టం చేసుకునే అవకాశం ఉండగా, ప్రతిపక్ష ఇండియా బ్లాక్ భవిష్యత్ బలహీనంగా ఉందని చిదంబరం హెచ్చరించారు. తర్వాత ఆ వ్యాఖ్యలను వారు తోసిపుచ్చారు. గురువారం నాడు కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ సహ రచయితగా రాసిన – కాంటెస్టింగ్ డెమోక్రటిక్ డిఫి సిట్ – అనే పుస్తకం ఆవిష్కరణ సభలో చిదంబరం ప్రసంగిస్తూ, ఇండియా బ్లాక్ భవిష్యత్ పై తనకు గల అనుమానాలను వివరించారు. మరో పక్క అధీకార బీజేపీ బలమైన శక్తిగా ఉందని పేర్కొన్నారు.

రెండో సహరచయిత మృత్యుంజయ్ సింగ్ యాదవ్ చెప్పినట్లు ఇండియా కూటమి భవిష్యత్ అంత అద్భుతంగా ఏమీ లేదు. అయితే యాదవ్ కూటమి ఇంకా చెక్కుచెదర కుండా ఉందని భావిస్తున్నట్లు కన్పిస్తోంది. ఈ అంశంపై సల్మాన్ ఖుర్షీద్ స్పష్టమైన సమాధానం చెప్పాలి. ఎందుకంటే, ఇండియా కూటమి(India alliance future) ఏర్పాటు చర్చల బృందంలో ఆయన కీలకంగా వ్యవహరించారని చిదంబరం పేర్కొన్నారు ఇండియా కూటమి చెక్కు చెదరకుండా ఉంది అంటే … తాని ఎంతో సంతోషిస్తానని, కానీ అది బలహీనంగా కన్పిస్తోందని చిదంబరం అన్నారు. అయితే ఇంకా చాలా సమయం ఉందని, ఈ లోగా చాలా సంఘటనలు జరగవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు..కాగా, చిదంబరం వ్యాఖ్యలపై బిజేపీకి చెందిన ప్రదీప్ భండారి ఒక వీడియా పోస్ట్ చేస్తూ, బీజేపీ బలమైన సంస్థ అని ప్రతిపక్షం భవిష్యత్ కూడా ఇప్పటిలాగే చెక్కుచెదరకుండా ఉంటుందని, అన్నారు. రాహుల్ గాంధీ సన్నిహితులకు కూడా కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని తెలుసు అని పేర్కొన్నారు.

బీహార్, బెంగాల్, తమిళనాడు లో కూటమికి అగ్నిపరీక్ష ఏ ఏడాదే మరి కొద్ది నెలల్లో బీహార్ లో ఎన్నికలు జరుగుతాయి.పశ్చిమ బెంగాల్, తమిళనాడులో 2026లోనూ, ఉత్తరప్రదేశ్ లో 2027 లోనూ ఎన్నికలు జరుగుతాయి. కర్ణాటక, తెలంగాణ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లో 2028లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం, ప్రతిపక్షాలకు వరుస పరాజయాల నేపథ్యంలో 2023 జూలై లో ఇండియా బ్లాక్ ఏర్పడింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏను అధికారం నుంచి గద్దె దింపాలని భావించిన ప్రతిపక్షాల కూటమి విఫలమైంది. ఈ గ్రూప్ మిశ్రమ ఫలితాలే సాధించగలిగింది. విజయాల కంటే ఓటములే ఎక్కువ. కాంగ్రెస్ నాయకత్వం పట్ల కూటమి సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతే కాకా, రాష్ట్రాలలో ప్రాంతీయ మిత్ర పక్షాలతో సీట్లు పంచుకోడానికి కూడా భాగస్వామ్య పక్షాలు ఇష్ట పడక పోవడంతో కూటమిలో సమన్వయం కలగానే నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News