Saturday, May 10, 2025

భారత్, పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయి: డోనాల్డ్ ట్రంప్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత(India), పాకిస్థాన్‌ల(Pakistan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్ధు ప్రాంతాల్లో పాక్ సైనికులు కాల్పులు జరపగా.. దాన్ని భారత్ సమర్థవంతంగా తిప్పి కొడుతోంది. ఈ కాల్పుల వల్ల కొందరు సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

భారత్, పాకిస్థాన్‌లు కాల్పుల విరమణకు అంగీకరించాయని.. అందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని ట్రంప్ ట్రూత్‌సోషల్‌లో పోస్ట్ చేశారు. ‘అమెరికా మధ్యవర్తిత్వంలో రాత్రంతా చర్చలు జరిగాయి.. తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్‌(India)-పాక్(Pakistan) అంగీకరించాయి. సరైన సమయంలో ఇరు దేశాలు విజ్ఞతతో, తెలివిగా వ్యవహరించాయని. అందుకు ధన్యవాదాలు’ అంటూ ట్రంప్ పోస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News