న్యూఢిల్లీ: కాల్పుల విరమణకు భారత్-పాకిస్తాన్ అంగీకరించాయని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. శనివారం సాయత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని వెల్లడించారు. ఎల్లుండి ఇరు దేశాల మిలిటరీ జనరల్స్ మధ్య తదుపరి చర్చలు జరుగుతాయి విక్రమ్ మిస్రీ తెలిపారు.
అంతకుముందు కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించాయంటూ సోషల్ మీడియా ద్వారా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అణ్వాయుధాలు కలిగిన రెండు పొరుగు దేశాలు భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో అమెరికా మధ్యవర్తిత్వం వహించిందన్నారు. రాత్రంతా భారత్-పాకిస్తాన్‌లతో చర్చలు జరిగాయని తెలిపారు. తక్షణమే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని చెప్పారు. శాంతి మార్గాన్ని ఎంచుకున్న రెండు దేశాలకు అభినందనలు అని ట్రంప్ పేర్కొన్నారు.
- Advertisement -