Wednesday, May 14, 2025

భారత్‌-పాక్‌ కలిసి డిన్నర్ చేస్తే.. ఉద్రిక్తతలు తగ్గుతాయి: ట్రంప్

- Advertisement -
- Advertisement -

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా.. భారత్(India) ఆపరేషన్ సిందూర్‌ను చెప్పట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్‌లోని(Pakistan) 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి భారత్ దాడి చేసింది. ఈ నేపథ్యంలో భారత-పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రెండు ప్రభుత్వాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంతో పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చాయి. కానీ, ఎప్పుడు ఏం జరుగుతుందో అని అంతా భయపడుతున్నారు. అయితే భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గడానికి తానే కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చెబుతున్నారు.

తాజాగా భారత్(India)-పాకిస్థాన్‌(Pakistan)ల మధ్య నెలకొన్న పరిస్థితులు ప్రశాంతంగా మాట్లాడాలి అంటే.. ట్రంప్ ఓ సలహా ఇచ్చారు. భారత్-పాక్ దేశాల అగ్రనేతలు తను ఏర్పాటు చేసే డిన్నర్‌కు హాజరు కావాలని ట్రంప్(Donald Trump) పేర్కొన్నారు. ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత్, పాక్‌ల శాంతి చేకూరాలని కాల్పుల విరమణ ఒప్పందం జరిగేలా చేశామని అన్నారు. భారత్, పాక్‌ రెండు శక్తివంతమైన దేశాలు.. యుద్ధం ఆపితే వ్యాపారాలు చేసుకుందాం అని సలహా ఇచ్చామని తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య కూడా యుద్ధం ఆపడానికి చర్చలు జరుపుతున్నామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News