Friday, August 1, 2025

ఫైనలైనా మాకు ముఖ్యం కాదు.. దేశమే ముఖ్యం: ఇండియన్ ఛాంపియన్స్

- Advertisement -
- Advertisement -

వరల్డ్ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్‌లో భారత ఛాంపియన్స్ (India Champions) జట్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్.. పాకిస్థాన్‌తో రెండుసార్లు తలపడే పరిస్థితి వచ్చింది. ఒక మ్యాచ్ లీగ్ దశలో కాగా.. మరో మ్యాచ్ సెమీ ఫైనల్స్‌లో. ఇప్పటికే లీగ్ దశలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ రద్దు చేసుకున్న భారత జట్టు.. ఇప్పుడు సెమీస్ నుంచి కూడా తప్పుకుంది. దీంతో పాకిస్థాన్ నేరుగా ఫైనల్స్‌కి చేరింది.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో ఏ రకంగా అయినా క్రికెట్ ఆడేది లేదని మాజీలు తేల్చి చెప్పారు. చెప్పినట్లుగానే సెమీ ఫైనల్ మ్యాచ్‌ని కూడా రద్దు చేసుకుంది. అయితే ఒకవేళ ఫైనల్స్‌లో పాకి్సాన్‌తో తలపడే పరిస్థితి వచ్చినా.. ఆ మ్యాచ్‌ను కూడా రద్దు చేసుకుంటామని భారత ఛాంపియన్స్ (India Champions) జట్టు స్పష్టం చేసింది.

‘‘పాకిస్థాన్‌తో ఆడే ప్రసక్తే లేదు. మాకు దేశమే ముఖ్యం. అందుకోసం ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటాం. భారత జట్టు సభ్యులుగా మేం ఎప్పుడూ గర్వపడుతుంటాం. మా దేశాన్ని, ప్రజల్ని ఎప్పటికీ నిరాశపరచం. సెమీస్‌కి చేరుకున్నాక మ్యాచ్ రద్దు చేసుకున్నాం.. ఒకవేళ ఫైనల్స్‌ అయినా.. ఇదే నిర్ణయం తీసుకుంటాం’’ అని ఇండియా ఛాంపియన్స్ జట్టు సభ్యుడొకరు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News