బాగ్లిహార్, కిషన్‌గంగ డ్యామ్‌ల నుంచి నీటి సరఫరా
కట్ పంజాబ్ ప్రావిన్స్‌లోని సాగు, తాగునీటిపై తీవ్ర
ప్రభావం దాయాదిపై జలయుద్ధాన్ని తీవ్రతరం చేసిన
భారత్ ఢిల్లీలో ఉత్కంఠ రేపుతున్న ప్రధాని మోడీ
వరుస భేటీలు 48గంటల వ్యవధిలో నౌకా, వాయు
దళాధిపతులతో మంతనాలు మీరు కోరుకున్నది
జరుగుతుంది.. అది నా బాధ్యత మోడీ పనితీరు,
పట్టుదల అందరికీ తెలిసిందే ఢిల్లీలో రక్షణ మంత్రి
రాజ్‌నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు కొనసాగుతున్న పాక్ ప్రముఖుల ఎక్స్ ఖాతాలపై నిషేధం భారత్ మాపై
వైమానిక దాడులు జరిపే అవకాశాలు: పాక్ రక్షణ మంత్రి
న్యూఢిల్లీ/శ్రీనగర్: పహల్గాం ఘటన తర్వాత పాకిస్థాన్‌పై దౌత్య, వాణిజ్య, జలయుద్ధాలతో ముపేట దాడి చేస్తున్న భారత్ మరోవైపు అమాయకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు, వాళ్లకు దన్నుగా నిలుస్తున్న దాయాదికి గట్టి బుద్ధి చెప్పాలని కంకణం కట్టుకున్నది. శత్రువులను శిక్షించి తీరుతామని కేంద్ర ప్రభుత్వం పెద్దలు కూడా వివిధ వేదికల మీ దుగా ప్రతినబూనుతున్నారు. ఈ క్రమంలో హస్తిన సహా జ మ్మూ కశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. సింధూ నదీ జలాల ఒప్పందం అమలును ని లిపివేస్తున్నట్లు ప్రకటించినట్లుగానే చర్యలకు ఉపక్రమించింది. బాగ్లిహార్ డ్యాంలోకి నీటి మట్టాన్ని తగ్గించింది. చినాబ్ నదీపై ఉన్న ఈ ఆనకట్ట నుంచి నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేసింది. తద్వారా దాయాదికి గట్టి హెచ్చరిక సందేశాన్ని పంపినట్లయింది.
బాగ్లిహార్ డ్యామ్‌ను మూసివేయడంతో పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చుక్క నీరుకూడా వెళ్లదు. దీంతో అక్కడి పంట పొలాలపై తీవ్ర ప్రభావం పడనుంది. తరువాతి క్రమంలో జీలం నదిపై ఉండే కిషన్‌గం గా డ్యామ్ వద్ద కూడా నీటి మట్టాన్ని తగ్గించేందుకు చర్య లు తీసుకోబోతున్నట్లు అధికారులు తెలిపారు. బాగ్లిహార్ డ్యాం వెంబడి ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులకు నీటి సరఫరా నియంత్రణ అంతా భారత్ చేతిలోనే ఉంటుంది. ఈ డ్యాం, దీనితో పాటు కిషన్‌గంగా డ్యామ్ హక్కులపై చిరకాలంగా భారత్, పాకిస్థాన్ మధ్య వివాదం రగులుతోంది. గతంలో దీనికి సంబంధించి పాకిస్థాన్ ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వాన్ని కోరింది. ఇక కిషన్‌గంగా డ్యామ్ విషయంలో కూ డా చట్టపరమైన చిక్కులు తలెత్తాయి. నీలం నది, దీని ఉపనది జీలం ప్రవాహాలపై ఈ డ్యామ్ ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో చట్టపరమైన , దౌత్యపరమైన స్క్రూటినీ అవసరమని అంతర్జాతీయ సంస్థలకు పాకిస్థాన్ విజ్ఞప్తి చేసింది.
వాయుసేన చీఫ్‌తో ప్రధాని మంతనాలు..
ఎన్‌ఎస్‌ఎ, సిడిఎస్, త్రివిధ దళాధిపతులతో ఇప్పటికే ఒక దఫా మంతనాలు జరిపిన ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా ఆయా విభాగాల అధిపతులను ప్రత్యేకంగా పిలిపించుకుంటున్నారు. నౌకాదళాధిపతితో సమావేశమైన 24గంటల వ్యవధిలోనే ఆదివారం నాడు వైమానిక దళాధిపతి ఏపీ సింగ్ కూడా మోడీని కలిశారు. ఈ సమావేశంపై ఎలాంటి అధికారప్రకటన వెలువడనప్పటికీ 40 నిమిషాల పాటు జరిగిన వీరి భేటీలో వైమానిక దళ బలాబలాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. అయితే పహల్గాం దాడి అనంతరం ఉన్నత స్థాయిలో జరుగుతున్న చర్చల పరంపరలో భాగంగానే భావిస్తున్నారు. ఏప్రిల్ 30న లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ప్రధాని మోడీ విదేశాంగ మంత్రి జైశంకర్‌తో పాటు ఎన్‌ఎస్‌ఎ అజిత్ ధోవల్‌తో కూడా సమావేశమయ్యారు.
ప్రముఖుల ఎక్స్ ఖాతాలపై నిషేధం..
పాకిస్థాన్ మాజీ ప్రధాని, క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోల ఎక్స్ సామాజిక భారతదేశం స్తంభింపచేసింది. ఈ నిర్ణయాన్ని ఆదివార అధికారికంగా ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడుల తరువాతి దశలో భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేఫథ్యంలోనే భారత్ ఈ చర్యకు దిగింది. చట్టపరమైన చర్యలలో భాగంగానే వీరి ఖాతాలను నిషేధించారు.అంతకు ముందు రోజు పాకిస్థాన్ సమాచార ప్రసార శాఖ మంత్రి అటాయుల్లా తరార్ ఎక్స్ అకౌంట్‌ను కూడా నిలిపివేశారు. పాకిస్థాన్‌పై భారత్ ఏ క్షణంలో అయినా ప్రత్యక్ష దాడులకు దిగుతుందని తరార్ వ్యాఖ్యానించారు. భారత్‌పై పాకిస్థాన్‌కు చెందిన పలువురు నేతలు , సామాజిక కార్యకర్తలు పలు విధాలుగా తమ సామాజిక మాధ్యమాల ద్వారా విద్వేషకర, రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగుతున్న వైనాన్ని గుర్తించి వెంటనే తగు చర్యలకు భారత ప్రభుత్వం దిగుతోంది.
ఇక శత్రువుకు దెబ్బకు దెబ్బ: రాజ్‌నాథ్
ఈట్ కా జవాబు పత్తర్‌సే . భారతదేశం వైపు వక్రదృష్టికి దిగే శత్రువుకు గట్టి బుద్ధి చెప్పి తీరుతామని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడి తరువాతి క్రమంలో ఆయన ఆదివారం పాకిస్థాన్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ, సంయమనం పాటిస్తున్నాం, ఎదుటి పక్షం దారికి రాకపోతే ఇక సంఘర్షణమే అని, దెబ్బకు దెబ్బనే కాదు పిడుగు పాట్లు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఇక పాక్‌పై భారత్ ప్రతీకార చర్యలు తప్పవనే బలీయ సంకేతాలను రాజ్‌నాథ్ సింగ్ ఇప్పుడు వెలువరించారు. ఈ పరిణమంతో ఇప్పుడు పాకిస్థాన్‌లోని భద్రతా, సైనిక బలగాలు మరింత అప్రమత్తం అయ్యాయి. భారత్‌కు నిలువెల్లా నెత్తుటి గాయాలకు పాల్పడే వారిని ఇక ఉపేక్షించేది లేదని రాజ్‌నాథ్ తెలిపారు.
కవ్వింపుల దేశానికి తగు విధంగా గుణపాఠం చెప్పాల్సిన కనీస బాధ్యత తనపై ఉందని, రక్షణ మంత్రిగా తన కర్తవ్యం ఇప్పుడు అత్యంత కీలకం అని సింగ్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. ప్రధాని మోడీ దేశ భద్రతా ఐక్యత విషయంలో ఎంతటి నిజాయితీతో నిక్కచ్చిగా వ్యవహరిస్తారనేది జనులందరికీ తెలుసు. ఉగ్రవాదుల అణచివేత విషయంలో ఆయన స్పందించే తీరు ఏమిటనేది అందరికీ తెలిసిందే అన్నారు. ఇందుకు అనుగుణంగానే రక్షణ శాఖ చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రధాని పంథాను మరో సారి గుర్తు చేస్తూ తాను పాకిస్థాన్‌కు సరైన విధంగా శిక్ష విధించేందుకు సిద్ధం అవుతున్నామని తెలిపారు. 2016 ఉరి ఉగ్రవాద దాడులు, 2019 పుల్వామా దాడుల తరువాత భారత్ ధీటుగా స్పందించడం, బాలాకోట్ వైమానిక ప్రతీకార దాడులకు దిగడం వంటి పరిణామాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇక పహల్గాం దాడులకు కూడా భారత్ నుంచి అప్పటి తరహా స్పందన తప్పనిసరి అవుతోందని భావిస్తున్నారు. శత్రువు తెలివిమీరి వ్యవహరిస్తే అంతకు తెగించి భారత్ ప్రతిచర్య ఉంటుందని కూడా రాజ్‌నాథ్ స్పందించారు.
పాక్‌పై భారత వైమానిక దాడి జరగొచ్చు: ఖ్వాజా ఆసీఫ్
ఇస్లామాబాద్: భారత్ వైమానిక దాడిచేయొచ్చన్న భయాందోళనలను పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసీఫ్ వ్యక్తం చేశారు. భారత్ వాయుసేనతో ఘర్షణ జరిగే అవకాశం అధికంగా ఉందని ఆయన పాకిస్థాన్‌కు చెందిన ఏఆర్‌వై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు. ఇప్పటికే త మ గగనతలంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన రాఫెల్ యుద్ధ విమానాలను అడ్డుకొన్నట్లు ఆయన తెలిపారు. వివిధ దేశాలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలనుకుంటుంటే…ఇండియా ఘర్షణ వాతావరణాన్ని పెంచుతోందని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 24న పహల్గాం ఉగ్రదాడి వెనుక ఉన వారిని, వారికి మద్దతు ఇచ్చిన వారిని శిక్షించి తీరుతామని, సాయుధ బలగాలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని అన్నాక ఖ్వాజా ఆసీఫ్ తన భయాందోళనలు విలేకరులతో పంచుకున్నారు. ‘దాడి అన్నది ఫిరంగు లు, బుల్లెట్లతోనే జరుగదు…అది అనేక రకాలుగా ఉండొచ్చు… వాటిలో ఒకటి భారత్ సింధు నీటిని ఆపేయడం. దానివల్ల పాకిస్థాన్‌లో త్రాగేందుకు నీ రు కరువై, పంటలు లేక ఆకలి చావులకు అవకా శం ఏర్పడుతుంది’ అని ఆయన శుక్రవారం ‘జి యో న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వూలో అన్నారు.