- Advertisement -
సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాక్ దాడులను భారత్ తిప్పికొడుతూనే ఉగ్రవాదులను వెంటాడుతోంది. ఈక్రమంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సాయుధ దళాలు విరుచుకుపడుతున్నాయి. శుక్రవారం భారత దళాలు PoK లోని నియంత్రణ రేఖ సమీపంలో ఉన్న పాక్ ఉగ్రవాదులకు సంబంధించిన బంకర్‌ను ధ్వంసం చేశాయి. భారత ఆర్మీ, బంకర్ పేల్చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరోవైపు, జమ్ముకాశ్మీర్ లోని సాంబ సెక్టార్‌లో చొరబాటుకు యత్నించిన ఏడుగురు ఉగ్రవాదులను బిఎస్ఎఫ్ దళాలు హతమార్చాయి. భారత్‌లోకి చొరబడేందుకు జైషేమహ్మద్ ఉగ్రవాదులు ప్రయత్నించారని, నిఘా డ్రోన్ ద్వారా చోరబాటుదారులను గుర్తించి మట్టుబెట్టినట్లు BSF వెల్లడించింది.
- Advertisement -