Friday, June 13, 2025

లింగ సమానత్వంలో 131వ ర్యాంక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలలో పురుషులు, మహిళల మధ్య వివిధ రంగాల్లో లింగ సమానత్వం బేరీజు వేసే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో భారతదేశం 131 స్థానానికి పడిపోయింది. పురుషులు, మహిళలు మధ్య ముఖ్యం గా ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలు, విద్య, ఆరోగ్యం, మనుగడ, రాజకీయ సాధికారత వం టి రంగాల్లో పొందుతున్న అవకాశాలు, రాణిస్తున్న తీరును బేరీజు వేసేదే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. వరల్డ్ ఎకనమిక్ ఫోరం గ్లోబల్ జెండర్ గ్లాప్ రిపోర్ట్ 2025 విడుదల చేసింది. మొత్తం 148 దేశాలలో నిర్వహించిన సర్వేలో భారత్ 131వ స్థానంలో నిలిచింది. నిరుడుక న్నా రెండు స్థానాలు దిగజారింది. గురువారం విడుదలైన నివేదిక ప్రకారం భారతదేశంలో లింగ సమానత్వ స్కోరు కేవలం 64.1శాతం. దక్షిణాసియాలో అత్యల్పర్యాంక్ సాధించిన దే శాలలో మనదేశం ఒకటి. భారత ఆర్థికవ్యవస్థ పనితీరు మొత్తం మీద 0.3 పాయింట్లు మెరుగుపడినట్లు నివేదిక తెలిపింది. భారతదేశంలో లింగ సమానత్వాన్ని పెంచే కోణాలలో ఒకటి ఆర్థిక భాగస్వామ్యం. అది ప్లస్ 9 శాతం పా యింట్లు మెరుగుపడి 40.7 శాతానికి చేరింది.

అంటే ఆదాయంలో సమానత్వం కాస్త మెరుగుపడింది. శ్రామిక శక్తి విషయంలో పురుషు లు, మహిళల భాగస్వామ్య రేటు గతసంవత్స రం మాదిరిగానే 45.9 శాతం ఉంది. విద్యా రంగంలో భారతదేశం ఏకంగా 97.1శాతం స్కోర్ సాధించింది. భారతీయ మహిళలు అక్షరాస్యత విషయంలో మెరుగైన శ్రద్ధ కన్పిస్తోంది. ఉన్నత విద్యలోనూ మహిళల వాటా పెరిగింద ని నివేదిక సూచిస్తోంది. శిశుమరణాలు తగ్గా యి. జననాల్లో లింగ నిష్పత్తి, ఆరోగ్యకరమైన ఆయుర్దాయం మెరుగుపడింది. భారతదేశం ఆరోగ్యం, మనుగడలో అధిక సమానత్వాన్ని నమోదు చేసింది. రాజకీయ సాధికారత విషయంలో భారతదేశంలో సమానత్వం స్వల్పం గా తగ్గింది. పార్లమెంటులో మహిళల ప్రాతిని ధ్యం 2025లో 14.7 శాతం నుంచి 13.8 శా తానికి పడిపోయింది. ముఖ్యంగా భారతదేశం ఇండెక్స్ దిగజారడానికి ఇదో కారణం.మంత్రి పదవుల్లో మహిళల వాటా 6.5 శాతం నుంచి 5.6 శాతానికి పడిపోయింది. అదే 2019లో 30 శాతంగా ఉంది. లింగ సమానత్వం మెరుగ్గా నిర్వహిస్తున్న దేశాలలో ఐస్లాండ్ వరుసగా 16ఏళ్లుగా నెంబర్ 1 స్థానంలో ఉంది. తర్వాత ఐస్‌లాండ్, నార్వే, బ్రిటన్, న్యూజిలాం డ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News