- Advertisement -
న్యూఢిల్లీ: ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషనర్ గా పనిచేస్తున్న ఓ అధికారిని భారత ప్రభుత్వం బహిష్కరించింది. 24 గంటలలోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఆ అధికారి తన అధికారహోదాకు తగని కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ చర్యతీసుకున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఆ అధికారి కార్యకలాపాలపై భారతదేశం న్యూఢిల్లీలోని పాకిస్తాన్ ఛార్జ్ డి ఎఫైర్స్ కు ఒక ప్రకటన జారీ చేసింది.
- Advertisement -