పాకిస్థాన్‌కు చెందిన విమానాలు తమ గగనతలాన్ని వినియోగించుకోకుండా విధించిన గడువును భారత్ మరోసారి పొడిగించింది. వచ్చే ఆగస్టు 24 వరకు పాక్ విమానాలు తమ గగనతలాన్ని వినియోగించుకోవడానికి వీల్లేదని నోటమ్ జారీ చేసింది. సెక్యూరిటీ ప్రోటోకాల్స్ కారణంగా గగనతల మూసివేతను పొడిగించామని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ నిర్ణయం కారణంగా పాక్ విమానాలు , ఆ దేశ సైన్యానికి చెందిన ఫైటర్ జెట్లు, కార్గో విమానాలు, భారత గగనతలాన్ని వినియోగించుకోవడానికి వీలుండదు. పహల్గా ఉగ్రదాడి తరువాత తమ గగనతలాన్ని పాక్ విమానాలు వినియోగించుకోకుండా భారత్ మొదట ఏప్రిల్ 30 న నోటమ్ జారీ చేసింది. ఆ తర్వాత మే 24, జూన్ 24, జులై 24కు దాన్ని పొడిగిస్తూ వస్తోంది. భారత్ చర్యకు ప్రతీకారంగా పాకిస్థాన్ కూడా తమ గగనతలాన్ని మూసివేసింది. వచ్చే నెల 24 వరకు భారత్‌కు చెందిన విమానాలు తమ గగనతలం మీదుగా ప్రయాణించడానికి వీల్లేదని నోటమ్ జారీ చేసింది.
పాక్ విమానాలకు భారత్ గగనతలం నిషేధం పొడిగింపు
- Advertisement -
- Advertisement -
- Advertisement -