Wednesday, September 3, 2025

ప్రధాన స్పాన్సర్ లేకుండా ఆసియా కప్ ఆడనున్న భారత్

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI)తో స్పాన్సర్‌షిప్ ఒప్పందం నుండి Dream11 ఇటీవల వైదొలిగిన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా రాబోయే ఆసియా కప్‌లో లీడ్ జెర్సీ స్పాన్సర్ లేకుండానే పాల్గొనే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ తన ఒప్పందాన్ని ముందస్తుగా ముగించుకుంది. గత నెలలో భారత ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. ఇది Dream11 నిష్క్రమణకు దారితీసింది. ఈ నిబంధన Dream11 వ్యాపారానికి పునాది అయిన రియల్-మనీ గేమింగ్‌ను నిషేధించింది. దీంతో కంపెనీ అధికారికంగా ఈ ఒప్పందం నుండి వైదొలగాలని తీసుకున్న నిర్ణయాన్ని BCCIకి తెలియజేసింది. సుమారు USD 44 మిలియన్ల(రూ.358 కోట్లు)తో Dream11-BCCIకి మధ్య కుదిరిన ఒప్పందం 2026 వరకు ఉంది. కొత్త నిబంధనతో ముందుగానే దీని నుండి Dream11 తప్పుకుంది.

Dream11 నిర్ణయంతో BCCI కొత్త లీడ్ స్పాన్సర్‌ కోసం అధికారిక ప్రక్రియను ప్రారంభించింది. కొత్త స్పాన్సర్‌లను ఆహ్వానించింది. ఆసక్తిగల పార్టీలు EOI పత్రాలను కొనుగోలు చేయడానికి సెప్టెంబర్ 12 వరకు గడువు ఉంది. సెప్టెంబర్ 9న UAEలో ఆసియా కప్ ప్రారంభమైన తర్వాత..సెప్టెంబర్ 16 నాటికి తుది బిడ్‌లు దాఖలు చేయాలి. ప్రస్తుత ఆహ్వానంలో BCCI తన స్పాన్సర్‌షిప్ ప్రమాణాలను స్పష్టం చేసింది. మద్యం, జూదం, క్రిప్టోకరెన్సీ, ఆన్‌లైన్ మనీ గేమింగ్, పొగాకు లేదా అశ్లీలతతో సహా ప్రజల సున్నితత్వాన్ని దెబ్బతీసేవిగా భావించే ఏవైనా ఉత్పత్తులను డీల్ చేసే కంపెనీలు అర్హత కలిగినవిగా పరిగణించబడవు.

కాగా, భారత క్రికెట్ మధ్య కాంట్రాక్ట్ స్పాన్సర్‌షిప్ శూన్యతను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. 2019లో, మొబైల్ బ్రాండ్ OPPO తన ఒప్పందం నుండి ముందస్తుగా నిష్క్రమించింది. దీని ఫలితంగా 2023లో Dream11 బోర్డులోకి వచ్చే ముందు edtech సంస్థ బైజు కొంతకాలం పనిచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News