Sunday, August 24, 2025

అంతరిక్షం నుంచి భారత్ అందంగా కనిపిస్తుంది: శుభాంశు శుక్లా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) ధన్యవాదాలు తెలిపారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం శుభాంశుతో పాటు గగన్‌యాత్రికులను సత్కరించారు. ఈ సమావేశంలో శుభాంశు మాట్లాడుతూ.. ఐఎఎఫ్ నేర్పిన మెలకువల వల్లే తాను అంతరిక్ష యాత్రకు వెళ్లగలిగానని.. అందుకు ఆయన ఐఎఎఫ్‌కు కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.

తన జీవితంలో ముఖ్యమైన గురువులు ఐఎఎఫ్, కాక్‌పిట్ మాత్రమే అని స్పష్టం చేశారు. వాటి ద్వారానే అంతరిక్ష యాత్రకు అవసరమయ్యే చాలా విషయాలను తెలుసుకున్నానని అన్నారు. భవిష్యత్తులో భారత్ చేపట్టే ‘గగన్‌యాన్’ ప్రాజెక్టుపై ప్రపంచం మొత్తం ఆసక్తి కనబరుస్తోందని.. చాలామంది శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టులో భాగం కావడానికి ఆసక్తి చూపిస్తున్నారని శుభాంశు (Shubhanshu Shukla) అన్నారు. అంతరిక్షం నుంచి భారత్ ఎంతో అందంగా కనిపిస్తుందని తెలిపారు. జీవితంలో తాను చూసిన దృశ్యాల్లో అది ఒకటిని పేర్కొన్నారు.

Also Read : భారత్ సరుకులు నచ్చకపోతే కొనొద్దు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News