నాలుగు రకాల జిఎస్టి శ్లాబ్‌లకు
ముగింపు అధిక భాగం
వస్తువులు 5 లేదా 18%
శ్లాబ్‌లకు బదిలీ కేంద్రం
ప్రతిపాదనకు మంత్రుల బృందం
ఆమోదం గృహాలపై పన్ను
భారం తగ్గనుంది ఆదాయ
నష్టం, గణాంకాలను
వెల్లడించాలన్న ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ : జిఎస్టి (వస్తు, సేవల పన్ను) వ్య వస్థలో రెండు శ్ల్లాబ్ల ప్రణాళికకు రాష్ట్ర మం త్రుల బృందం(జిఒఎం) ఆమోదం తెలిపిం ది. ఇప్పటివరకు ఉన్న 4 రకాల జిఎస్టి శ్ల్లా బ్‌లను తగ్గించి, ఇకపై రెండు ప్ర ధాన శ్ల్లాబ్ లు 5 శాతం, 18 శాతం మాత్రమే ఉండేలా అంగీకరించారు. ప్రస్తుతం జిఎస్టి 5 శా తం, 12 శాతం, 18 శాతం, 28 శాతం శ్ల్లాబ్ లు ఉన్నాయి. కొత్త విధానంలో 12 శా తం, 28శాతం శ్ల్లాబ్లు తొలగించారు. కొంతమం ది ప్రతిపక్ష రాష్ట్రాల నాయకులు ఈ చర్యతో జరిగే ఆదాయ నష్టం, దీనిని ఎలా భర్తీ చేస్తారో చెప్పాలని కోరారు.
12 శాతం శ్ల్లాబ్లో ఉన్న 99 శాతం వస్తువులు ఇకపై 5 శాతం కిందకు వస్తాయి. 28 శాతం శ్ల్లాబ్లో ఉన్న 90 శాతం వస్తువులు 18 శాతం కిం దకు మారనున్నాయి. అయితే పొగాకు ఉత్పత్తులు, విలాస వస్తువులపై మాత్రం 40 శాతం ప్రత్యేక పన్ను కొనసాగుతుంది. లగ్జరీ కార్లను కూడా 40 శాతం పన్ను కిందకు తేవాలని సూచించారు. ఈ సమావేశానికి బీహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అధ్యక్షత వహించారు. సభ్యులుగా యుపి ఆర్థిక మంత్రి సురేశ్ కుమార్ ఖన్నా, రాజస్థాన్ ఆరోగ్య మంత్రి గజేంద్రసింగ్, పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య, కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ గౌడ, కేరళ ఆర్థిక మంత్రి కె.ఎన్. బాలగోపాల్ పాల్గొన్నారు. వీరంతా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రతిపాదనలు పరిశీలించి ఏకాభిప్రాయానికి వచ్చారు. కేంద్రం కొత్త జిఎస్టి నిర్మాణం గృహాలు, రైతులు, మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిస్తుందని భావిస్తోంది.
చౌక కానున్న వస్తువులు
ఔషధాలు, ప్రాసెస్డ్ ఫుడ్, దుస్తులు, పాదరక్షలు, రోజువారీ గృహోపయోగ వస్తువులు 5 శాతం శ్ల్లాబ్లోకి మారతాయి. టీవీలు, పెద్ద ఎలక్ట్రానిక్ పరికరాలు, హోమ్ అప్లయన్సెస్ 28 శాతం బదులు 18 శాతం కిందకు రావడంతో ధరలు తగ్గే అవకాశం ఉంది.
కాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, రేటు తగ్గింపు ద్వారా సాధారణ ప్రజలు, రైతులు, మధ్యతరగతి, ఎంఎస్ఎంఇలకు పెద్ద ఊరటనిస్తుందని అన్నారు. అదేవిధంగా సరళమైన, పారదర్శకమైన, అభివృద్ధి ప్రధాన పన్ను వ్యవస్థ ఏర్పడుతుంది అని తెలిపారు.
సమావేశంలో వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై జిఎస్టి మినహాయింపు అంశం కూడా చర్చకు వచ్చింది. జిఎస్టిలో బీమా ప్రీమియం మినహాయింపు వల్ల కేంద్రానికి ప్రతి సంవత్సరం రూ. 9,700 కోట్లు ఆదాయ నష్టం కలుగుతుందని అంచనా వేశారు. అయితే, రాష్ట్రాలు ఎక్కువగా ఈ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చాయి. బీమా సంస్థలు ఈ లాభాన్ని కస్టమర్లకు నిజంగా అందిస్తాయా లేదా అనేది పర్యవేక్షణ అవసరమని సూచించాయి. మంత్రుల బృందం సిఫార్సులు ఇప్పుడు జిఎస్టి కౌన్సిల్‌కు పంపుతారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన కౌన్సిల్ ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకోనుంది.