ఉగ్రవాదుల అప్పగింతపై చర్చలకు సిద్ధం
ఆపరేషన్ సిందూర్ ఆగలేదు
ప్రధాని మోడీ సంచలన ప్రకటన
ఆపరేషన్ సిందూర్ ద్వారా సైనికంగా,
రాజకీయంగా, మానసికంగా పాక్‌ను చావుదెబ్బ
కొట్టాం జైషే మహద్ ప్రధాన కార్యాలయం
నేలమట్టం రహిమ్యార్ ఖాన్ వైమానిక స్థావరం
పూర్తిగా ధ్వంసం ఉగ్రతండాలపై అగ్నివర్షం
కురిపించాం ఈ నెల 7న సైనిక చర్య తరువాత
పాక్ డిజిఎంఓకు సమాచారం ఇచ్చాం, 10న
చర్చలకు ప్రతిపాదన వచ్చింది ప్రతిరౌండ్‌లోనూ
పాక్ పరిస్థితి దిగజారింది వైమానిక స్థావరాలపై
దాడులతో ఉక్కిరిబిక్కిరి ఆ తరువాతే భారత్‌తో
పోరాడలేమని చేతులెత్తేసింది మీడియాకు
కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం
నేడు హాట్‌లైన్ ద్వారా భారత్, పాక్
డిజిఎంఓల చర్చలు
న్యూఢిల్లీ: కశ్మీర్ విషయంలో తమకు స్ప ష్టమైన వైఖరి ఉందని భారత్ మరోసారి స్పష్టం చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పిఓకె) తిరిగి రావడమనే ఒకే ఒక అంశం మిగిలి ఉందని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు మీడియాకు సమాచా రం ఇచ్చాయి. ఈనెల 7న పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన తర్వాత పాక్ డిజిఎంఓకు సమాచచారం ఇచ్చామ ని, చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పామని వెల్లడించాయి. అయితే పాక్‌నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదని తెలిపాయి. ఇరు దేశాల మధ్య కాల్పులుతీవ్రస్థాయికి చేరుకున్న తర్వాత ఈ నెల10న పాకిస్థాన్‌నుంచి చర్చలకు ప్రతిపాదన వ చ్చినట్లు పేర్కొన్నాయి. ఆపరేషన్ సింధూ ర్ ప్రారంభమైన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా దళాలకు పాక్ బులెట్లకు శతఘ్ని గోళాలతో సమాధానం
ఇవ్వాల ని(వహాసే గోలీ చలేగి, తో యహాసే గోలా చలేగా) అని చెప్పారని కూడా ఆ వర్గాలు తెలిపాయి. భారత్ జరిపిన దాడుల్లో ర హిమ్యార్ ఖాన్ వైమానిక స్థావరం రన్‌వే పూర్తిగా నేలమట్టమయినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆపరేషన్ సిందూర్ ఇంకా పూర్తిగా ముగియలేదని కూడా స్పష్టం చేశాయి. ‘బహవాల్‌పూర్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయాన్ని నేలమట్టం చేశాం.పాకిస్థాన్‌ను భారీగా, బలంగా, అత్యంత సుదూర ప్రాంతాల్లో దెబ్బతీశాం.అటువైపునుంచి బుల్లెట్లతో దాడి చేస్తే.. మనం బాంబులతో సమాధానం చెప్పాం.బహవల్‌పూర్‌తో పాటు మురుద్కే, ముజఫరాబాద్ ఉగ్రవాద కేంద్రాలను నేలమట్టం చేశాం. మే 10న పాకిస్థాన్ దాడికి ప్రతిస్పందనగా అగ్నివర్షం కురిపించాం. మొత్తం 8 స్థావరాలు లక్షంగా దాడులు చేశాం’ అని ప్రభుత్వ వర్గాలు మీడియాకు వెల్లడించాయి.
ఎవరి మధ్యవర్తితం మాకు అవసరం లేదు
కశ్మీర్ విషయంలో భారత్‌కు ఒక స్పష్టమైన వైఖరి ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను అప్పగించడం మినహా మరో విషయం లేదు. అంతకు మించి మాట్లాడేది లేదు. ఉగ్రవాదుల అప్పగింతపై వాళ్లు మాట్లాడితే మేమూ మాట్లాడుతాం. మరో విషయంపై మాట్లాడే ఉద్దేశం మాకు లేదు. ఇందులో ఎవరి మధ్యవర్తిత్వాన్ని మేము కోరుకోవడం లేదు. ఎవరూ మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరమూ లేదు’ అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
పాక్‌ను చావుదెబ్బ కొట్టాం
ఆపరేషన్ సిందూర్ ద్వారా మూడు లక్షాలను సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.సైనికంగా, రాజకీయంగా, మానసికంగా పాక్‌ను దెబ్బకొట్టినట్లు తెలిపాయి.ప్రతి రౌండ్‌లోనూ పాక్ పరిస్థితి మరింత దిగజారిందని, భారత్ చేతిలో ఓటమి పాలయిందని వెల్లడించింది. పాకిస్థాన్ వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేయగా, ఇక పోరాడలేమని దాయాది దేశం తెలుసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
నేడు హాట్‌లైన్‌లో భారత్‌పాక్ చర్చలు
భారత్ పాక్ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణకు అంగీకరించిన ఇరు దేశాల డిజిఎంఓలు తదుపరి అంశాలపై ఈ నెల 12న మరో దఫా చర్చలు జరపాలని నిర్ణయించారు కూడా. కాగా ఈ క్రమంలో కాల్పుల విరమణ, తదనంతర పరిస్థితిపై ఇరు దేశాల మధ్య సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి. హాట్‌లైన్‌లో జరగనున్న ఈ చర్చల్లో ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్( డిజిఎంఓ)లు పాల్గొననున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతలు తగ్గించడం వంటి అంశాలు చర్చల్లో ప్రస్తావనకు రావచ్చని తెలుస్తోంది.