- Advertisement -
ఆసియాకప్ హాకీ టోర్నమెంట్‌లో భారత పురుషుల జట్టు ఫైనల్‌కు చేరుకుంది. శనివారంఏకపక్షంగా సాగిన చివరి సూపర్4 మ్యాచ్‌లో భారత్ 7-0 గోల్స్ తేడాతో చైనాను చిత్తు చేసింది. ఈ గెలుపుతో భారత్‌కు ఫైనల్ బెర్త్ సొంతమైంది. ఆదివారం జరిగే తుదిపోరులో డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియాతో భారత్ తలపడుతుంది. ఇందులో గెలిచే టీమ్ బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరిగే ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్‌కు అర్హత సాధిస్తాయి.
ఇక చైనాతో జరిగిన మ్యాచ్‌లో శీలానంద్ లక్రా 4వ నిమిషంలోనే భారత్‌కు తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత దిల్‌ప్రీత్, మన్‌దీప్ సింగ్, రాజ్‌కుమార్ పాల్, సుఖ్‌జీత్ సింగ్‌లు ఒక్కో గోల్‌ను నమోదు చేశారు. మరోవైపు అభిషేక్ రెండు గోల్స్‌ను సాధించాడు.
- Advertisement -