బర్మింగ్‌హామ్: ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) రెండవ ఎడిషన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ టోర్నీ నుంచి భారత జట్టు వైదొలిగింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఆడేందుకు నిరాకరిస్తూ టోర్నీ నుంచి తప్పుకుంది భారత్. జూలై 31న ఇరుజట్ల మధ్య మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ, ఇటీవల ఇరు దేశాల మద్య చోటుచేసుకున్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా భారత జట్టు, పాకిస్తాన్ తో ఆడేందుకు నిరాకరించింది. దీంతో ఈ మ్యాచ్ రద్దు చేశారు.
భారత్ తప్పుకోవడంతో పాకిస్తాన్ ఫైనల్ కు అర్హత సాధించింది. అయితే, పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఇదే జరిగితే.. పాక్-ఇంగ్లాండ్ జట్లు తొలి సెమీ ఫైనల్ లో తలపడతాయి.లీగ్ దశలో వెస్టిండీస్ పై గెలిచిన భారత్ నాలుగో స్థానంలో నిలవగా.. పాకిస్తాన్ నాలుగింట్లో విజయం సాధించి టాప్ ప్లేస్ ఉంది. లీగ్ దశలోనూ పాక్ తో ఆటను టీమిండియా ఆటగాళ్లు బహిష్కరించిన సంగతి తెలిసిందే.