మాంచెస్టర్: ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ (Rishabh Pant) గాయాన్ని లెక్క చేయకుండా బ్యాటింగ్‌కి వచ్చాడు. బుధవారం జరిగిన తొలి రోజు ఆటలో క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని గోల్ఫ్ కార్ట్‌లో అతను మైదానం వీడాడు. అయితే రెండో రోజు 264/4 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. కొంత సేపటికే రవీంద్ర జడేజా(20) వికెట్ కోల్పోయింది.
ఈ నేపథ్యంలో శార్ధూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్‌లు కట్టుదిట్టంగా బ్యాటింగ్ చేశారు. తమ వికెట్ కాపాడుకుంటూ పరుగులు రాబట్టారు. అయితే బెన్‌స్టోక్స్ వేసిన 102వ ఓవర్ నాలుగో బంతికి ఠాకూర్(41) బెన్ డకెట్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే ఆరో వికెట్ పడటంతో రిషబ్ పంత్ (Rishabh Pant) బ్యాటింగ్‌కి వచ్చాడు. పంత్ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. దీంతో రెండో రోజు లంచ్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. క్రీజ్‌లో పంత్(39), సుందర్(20) ఉన్నారు.