Sunday, August 3, 2025

మూడో స్థానానికి భారత్ పరుగులు

- Advertisement -
- Advertisement -

బలమైన ఆర్థికశక్తిగా ఎదుగుతున్న
భారత్ త్వరలోనే మూడో
అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఆవిర్భావం
స్వదేశీ ఉత్పత్తుల విప్లవానికి
నడుం బిగించాలి అన్ని రాజకీయ
పార్టీలు విభేదాలను విస్మరించి
సహకరించాలి భారత్‌ది డెడ్
ఎకానమీ అంటూ ట్రంప్ చేసిన
వ్యాఖ్యలపై మోడీ విసుర్లు

వారణాసి: దేశ ప్రజానీకం స్వదేశీ స్పూర్తిని అవలంభించాలి. స్థానిక ఉత్పత్తుల కొనుగోళ్లతో వాటికి మద్దతు ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. తమ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసికి శనివారం వచ్చిన ప్రధాని ఇక్కడ బహిరంగ సభలో మాట్లాడారు. ప్రపంచ స్థాయిలో ఆర్థిక అనిశ్చితి, సంక్షోభం ఉన్న దశలో స్థానిక ఉత్పత్తులకు పెద్ద పీట వేయడం మన బాధ్యత , ఇదే దేశానికి నిజమైన సేవ అవుతుందని పిలుపు నిచ్చారు. అమెరికా అధ్యక్షులు భారత్ ఓ డెడ్ ఎకానమీ అని వ్యాఖ్యానించడం, పాతిక శాతం సుంకాల విధింపును మోడీ పరోక్షంగా ప్రస్తావించారు. స్వదేశీకి ప్రాధాన్యతతో ట్రంప్ సుంకాలకు తగు జవాబు ఇవ్వవచ్చునని తెలిపారు. ఆర్థిక పురోగతి అనేది పలు కీలక విషయాలపై ఆధారపడి ఉంటుంది. మనం మన స్థానిక తయారీ ఉత్పత్తులను ఆదరించడం ద్వా రా మనకు మనమే ఆదరణీయ స్థానంలో నిలబెట్టుకున్న వారిమి అవుతామని ప్రధాని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ తన సొంత ఆర్థిక ప్రాధాన్యతల పట్ల అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుందన్నారు.

ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక శక్తిగా మారుతున్న మన దేశం ఇప్పుడు మరింత బాధ్యతాయుతంగా స్పందించాల్సి ఉంటుందని చెప్పారు. అమెరికా నుంచి పాతిక శాతం సుంకాల విధింపు నేపథ్యంలో ప్రధాని మోడీ వారణాసి నుంచే మరోసారి స్వదేశీ నినాదాన్ని బలోపేతం చేశారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యతాక్రమాలు ఖరారు చేసుకుని ఉన్నామని , రైతులు, చిన్న పరిశ్రమలు యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన ఈ క్రమంలో కీలకం అని తెలిపారు. లక్షాల సాధనలో ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తోంది. అయితే పౌరులకు కూడా ఈ క్రమంలో వారి వారి బాధ్యతలు ఉంటాయని వివరించారు. మన ఆర్థిక పురోగతి వేగవంతానికి జాతీయ స్థాయిలో స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహ ఉద్యమం రూపొందాల్సిందే అని స్పష్టం చేశారు. ఇది కేవలం మోడీ మాటనే అనుకోవద్దు, ప్రతి పౌరుడు విధిగా దీనిని ఆచరించాల్సి ఉంటుందన్నారు. ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి నేత కూడా తమ శషభిషలను పక్కకు నెట్టి జాతీయ ప్రయోజనాల దిశలో కలిసికట్టుగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు.

దేశంలోని వ్యాపార వర్గాలు, ప్రతి దుకాణదారు విధిగా స్వదేశీ సరుకునే విక్రయిస్తామని ప్రతిన వహించాలని కోరారు. ప్రపంచ ఆర్థిక ప్రమాద ఘంటికల నేపథ్యంలో ఈ విధమైన నిర్ణయం మనకు సరికొత్త మలుపుగా మారుతుందని తెలిపారు. వినియోగదారుడు విచక్షణాయుత రీతిలో వ్యవహరించాలి. ఏదైనా కొనేముందు ఆ వస్తువు భారతీయుడి తయారీనా అనేది తేల్చుకోవాల్సి ఉంది. మన ప్రజల చెమటతో రూపొందిందేనా అని పరీశిలించుకోవాలి, భారతీయ నైపుణ్యత ఇమిడి ఉందా? అనేది తేల్చుకుని మనం లోకల్ నినాద మంత్రం పాటించాల్సి ఉందన్నారు. ఇప్పుడు పెండ్లిళ్లు పండుగల సీజన్ ఆరంభమైంది. ఈ దశలో సాగే అత్యధిక కొనుగోళ్లు దేశీయ ఉత్పత్తుల కోణంలోనే సాగాల్సి ఉందన్నారు. మన ప్రతి పైసా మనకు చెందితేనే మనం ఆర్థికంగా బలోపేతం అవుతామన్నారు.

సిందూర్ మహాదేవుడికి అంకితం
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వారణాసి సభలో ఆపరేషన్ సిందూర్ విషయాన్ని ప్రస్తావించారు. శివుడి రుద్రరూప తాండవం ఈ చర్యకు స్ఫూర్తి అన్నారు. . భారతదేశంపై దాడికి సాహసించే వారిని సహించేది లేదని, వారు పాతాళ లోకంలో దాక్కున్నా వదిలేది లేదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ దేశ బలాన్ని ప్రపంచానికి చాటింది.
ఈ వీరోచిత సైనిక చర్యను ఇక్కడి మహాదేవుడికి జాతి తరఫున తాను అంకితం చేస్తున్నానని ప్రకటించారు. తమ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసి పర్యటనకు పచ్చిన దశలో ఏర్పాటయిన బహిరంగ సభలో మాట్లాడారు. సైనికుల సాహస చర్యను ప్రతిపక్షాలు కించపరుస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు మన సైనిక బలగాల ధైర్యాన్ని, త్యాగాలను అవమానిస్తూ వచ్చింది. ఈ తంతుతోనే సాగుతోందని విమర్శించారు. పాకిస్థాన్ లోపలికి వెళ్లి మనం ఉగ్ర స్థావరాలను దెబ్బతీయడం ప్రతిపక్షాలకు కంటగింపు అయిందని మండిపడ్డారు. జాతి విజయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. వారణాసికి వచ్చిన ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ హస్తకళలతో రూపొందిన అత్యంత ప్రామాణికమైన మూడు శివలింగాలను కానుకగా అందించారు. స్థానిక హస్తకళాకారులు ఈ ప్రతిమలను రూపొందించారని ఆయన వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News