Sunday, May 25, 2025

భారత సైన్యాన్ని చూస్తే గర్వంగా ఉంది: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన భారత సైన్యాన్ని చూస్తే గర్వంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సైన్యానికి దేశం మొత్తం వందనం, అభివందనం చేస్తోందన్నారు. సైన్యం సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్‌ సిందూర్‌ ఓ ఉదాహరణ అని చెప్పారు. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత ఆదివారం ప్రధాని మోడీ తొలి మన్‌కీ బాత్‌ లో ప్రసంగించారు.

మన్ కీ బాత్ 122వ ఎపిసోడ్‌లో ప్రధాని మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్‌లో ఖచ్చితమైన ఆపరేషన్ నిర్వహించిన భారత సైన్యం శౌర్యానికి మొత్తం దేశం గర్విస్తుందని అన్నారు. నేడు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మొత్తం దేశం ఐక్యంగా ఉంది. “ఆపరేషన్ సిందూర్ సమయంలో మన దళాలు ప్రదర్శించిన ధైర్యం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటానికి ఆపరేషన్ సిందూర్ కొత్త విశ్వాసం, ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆపరేషన్ సిందూర్ దేశ ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసింది. అనేక కుటుంబాలు దానిని తమ జీవితాల్లో భాగంగా చేసుకున్నాయి” అని ప్రధాని అన్నారు.

“ప్రతి భారతీయుడి సంకల్పం.. ఉగ్రవాదాన్ని నిర్మూలించడం. సరిహద్దు వెంబడి ఉన్న ఉగ్రవాద స్థావరాలను మన దళాలు కచ్చితత్వంతో ధ్వంసం చేయడం అసాధారణమైనది. ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక లక్ష్యం కాదు.. ఇది మన సంకల్పం, ధైర్యం, పరివర్తన చెందుతున్న భారతదేశానికి ప్రతిబింబం” అని ప్రధానమంత్రి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News