ఈ ఏడాది మహిళల వన్డే ప్రపంచకప్ జరగనుంది. భారత్(Team India), శ్రీలంక సంయుక్తంగా అతిథ్యమివ్వనున్న ఈ మెగా టోర్నమెంట్ కోసం 15 మందితో కూడిన భారత జట్టును మంగళవారం బిసిసిఐ ప్రకటించింది. ఈ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యవహరిస్తుండగా.. వైస్ కెప్టెన్ బాధ్యతలను స్మృతి మందన్నాకు అప్పగించారు. డాషింగ్ బ్యాటర్ షెఫాలీ వర్మకు మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు. గాయం కారణంగా చాలాకాలం జట్టుకు దూరంగా ఉన్న పేసర్ రేణుకా ఠాకూర్‌కి తిరిగి జట్టులో చోటు దొరికింది.
బౌలింగ్ విభాగంలో పేసర్, ఆల్ రౌండర్ అమన్‌జోత్ కౌర్‌కి జట్టులో చోటు లభించింది. ఇక తేజల్ హసబ్నిస్, ప్రేమ రావల్, ప్రియా మిశ్రా, ఉమ ఛెత్రీ, మిన్నూ మణి, సయాలీ సత్ఘరే స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక అయ్యారు. ఈ మెగా టోర్నమెంట్ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో భారత్, శ్రీలంక తలపడుతాయి. అక్టోబర్ 5న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక భారత్ (Team India) అక్టోబర్ 9న సౌతాఫ్రికాతో, 12న ఆస్ట్రేలియాతో, 19న ఇంగ్లండ్‌తో, 23న న్యూజిలాండ్‌తో, 26న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
వన్డే ప్రపంచకప్ కోసం భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మందన్నా(వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(కీపర్), యస్తికా భాటియా(కీపర్), దీప్తి శర్మ, స్నేహ్ రాణా, అమన్‌జ్యోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, రేణుకా ఠాకూర్.