Friday, August 29, 2025

భారత హాకీ జట్టు శుభారంభం

- Advertisement -
- Advertisement -

ఆసియాకప్ హాకీ టోర్నమెంట్‌లో భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం బిహార్‌లోని రాజ్‌గిర్ వేదికగా జరిగిన హోరాహోరీ పోరులో భారత్ 4-3 గోల్స్ తేడాతో చైనాను ఓడించింది. ఆరంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. భారత స్టార్ ఆటగాడు హర్మన్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్‌తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వచ్చే ఏడాది బెల్జియం వేదికగా జరిగే ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్‌కు అర్హత సాధించాలనే పట్టుదలతో భారత్ బరిలోకి దిగింది. ఊహించినట్టే తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చైనా, భారత్ ఆటగాళ్లు సర్వం ఒడ్డి పోరాడారు. నరాలు తెగే ఉత్కంఠత మధ్య మ్యాచ్ సాగింది. ఇక చివరి వరకు నిలకడైన ఆటను కనబరిచిన ఆతిథ్య భారత జట్టు చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News