- Advertisement -
బంగ్లాదేశ్ గడ్డపై భారత్‌తో జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్ రద్దయ్యింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు శనివారం అధికారికంగా ప్రకటించింది. బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మరో 3 టి20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆగస్టులో ఈ సిరీస్ జరగాల్సి ఉండేది. అయితే బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో టీమిండియాను అక్కడ పర్యటించేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో సిరీస్‌ను రద్దు చేయక తప్పలేదు. పరిస్థితులు మాములుగా మారితే మళ్లీ ఇరు జట్ల మధ్య సిరీస్ జరిగే అవకాశాలున్నాయి. ఇదిలావుంటే భారత్‌తో సిరీస్ రద్దు కావడం తమను ఎంతో బాధకు గురి చేసిందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది.
- Advertisement -