Tuesday, September 16, 2025

నేడు భారత్‌ అమెరికా వాణిజ్య చర్చలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంగా భారత్ ఎగుమతులపై ట్రంప్ 50 శాతం సుంకాల భారం విధించడం తో ఇరు దేశాల సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చల్లో తలెత్తిన అనిశ్చితిని తొలగించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నా యి. ఇందులో భాగంగా సోమవారం రాత్రి అ మెరికా ప్రతినిధి, ట్రంప్ సహాయకుడు ,దక్షిణ మధ్య ఆసియాకు అసిస్టెంట్ యూఎస్ ట్రేడ్ ప్రతినిధి బ్రెన్డన్ లించ్ భారత్‌కు రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళవారం రెండు దేశాల మధ్య తిరిగి చర్చలు జరుగుతాయని ప్రభుత్వ వాణిజ్య చర్చలు
అధికారులు తెలిపారు. గత మార్చి నుంచి ఉభయ దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఇంతవరకు ఐదు దఫాలుగా చర్చలు జరగ్గా, ఆరో దఫా చర్చల కోసం అమెరికా బృందం ఆగస్టు 2529 మధ్య భారత్ రావలసి ఉన్నప్పటికీ అది రద్దయింది. ఇది ఆరో రౌండ్ చర్చలే కాదు, వాణిజ్యంపై కచ్చితంగా భవిష్యత్ చర్యలను నిర్ణయించే చర్చలని, అమెరికాతో ఒప్పందం కుదరడానికి ప్రయత్నిస్తామని భారత్ ప్రధాన ప్రతినిధి, వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News