Saturday, July 26, 2025

బ్రిటన్‌తో స్వేచ్ఛ్ఛా వాణిజ్యం

- Advertisement -
- Advertisement -

మోడీ , బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్
సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య
మంత్రుల సంతకాలు రెండు
దేశాల మధ్య ఏటా రూ.34
బిలియన్ డాలర్లకు పెరగనున్న
వాణిజ్యం ఇయు నుంచి బ్రిటన్
వైదొలిగిన తరువాత కుదిరిన
అతిపెద్ద ఒప్పందం ఇదే భారత్
నుంచి ఎగుమతి అయ్యే 99శాతం
వస్తువులపై బ్రిటన్‌లో సుంకాలు
ఏవీ ఉండవు బ్రిటన్ నుంచి
దిగుమతి అయ్యే వస్తువులపై
భారీగా సుంకాలు తగ్గించనున్న
భారత్ భారతీయ ఉత్పత్తులకు
పెరగనున్న మార్కెట్ : ప్రధాని మోడీ

చరిత్రాత్మకమైన భారీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారతదేశం, బ్రిటన్ గురువారంనాడు సంతకాలు చేశాయి. దీని ద్వారా ఉభయదేశాల మధ్య ఏటా 34 బిలియన్ అమెరికా డాలర్ల మేరకు వాణిజ్యం జరుగుతుందని భావిస్తున్నారు 2020లో యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగిన తర్వాత ఒకదేశంతో కుదుర్చుకున్న అతి పెద్ద వాణిజ్య ఒప్పందం ఇదే. లండన్ లో భారత ప్రధాని మోదీ, బ్రిటీష్ ప్రధాని కీర్ స్టార్మర్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఈ ఒప్పందం
కుదిరింది. బ్రిటన్ విదేశీ వ్యాపారం, వాణిజ్య శాఖ మంత్రి జోనాథన్ రేనాల్డ్స్, భారత వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. బ్రిటన్ లో రెండురోజుల అధికార పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ , బ్రిటన్ ప్రధాని స్టార్మర్ తో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఉభయదేశాల మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ ఒప్పందం రెండుదేశాల పురోభివృద్ధికి ప్రాతిపదిక కాగలదని అన్నారు. దీంతో వాణిజ్యం ఇమ్మడి ముమ్మడిగా పెరుగుతుందని వివరించారు. ఉభయదేశాలకు ఇది చరిత్రలో గుర్తుండి పోయే రోజు అంటూ, పలు ఏళ్ల కృషి ఫలితంగా రెండు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం సాకారమైందని మోదీ అన్నారు.

ఒప్పందం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, భారతీయ వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, ఇండనీరింగ్ ఉత్పత్తులు, పాదరక్షలు, సముద్ర ఆహార ఉత్పత్తులకు బ్రిటన్ లో చక్కటి మార్కెట్ లభిస్తుందని, భారతీయ వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పరిశ్రమకు మార్కెట్‌లో కొత్త అవకాశం లభిస్తుందని ప్రధాని అన్నారు. ముఖ్యంగా ఈ ఒప్పందంతో భారతీయ యువత, రైతులు మత్య్సకారులు, పరిశ్రమల రంగాలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన తెలిపారు. భారతదేశంలోని ప్రజలు కూడా బ్రిటన్ లో పరిశ్రమలు తయారు చేసిన వైద్య పరికరాలు, ఏరో స్పేస్ విడిభాగాలు, ఇతర ఉత్పత్తులను సరసమైనధరలకు పొందగలరని మోదీ తెలిపారు. బ్రిటీష్ ప్రధాని స్టార్మర్ మాట్లాడుతూ ఈ వాణిజ్య ఒప్పందం వల్ల ఉభయదేశాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని, సంబంధాలు మెరుగవుతాయని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News