Thursday, September 18, 2025

శ్రీలంక లక్ష్యం 138

- Advertisement -
- Advertisement -

శ్రీలంకతో మంగళవారం జరిగిన మూడో, చివరి టి20లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. వర్షం వల్ల మ్యాచ్ దాదాపు గంటకు పైగా ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (10), శాంసన్ (0), రింకు సింగ్ (8), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (8) నిరాశ పరిచారు. అయితే శుభ్‌మన్ గిల్ (39) జట్టుకు అండగా నిలిచాడు. చివర్లో రియాన్ పరాగ్ (26), సుందర్ (25) రాణించడంతో భారత్ మెరుగైన స్కోరును సాధించింది. లంక బౌలర్లలో మహీశ్ తీక్షణ అద్భుత బౌలింగ్‌ను కనబరిచాడు. అతను మూడు వికెట్లను పడగొట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News