బెంగళూరు: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి బెంగళూరుకు వచ్చాను అని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. బెంగళూరులో ఆయన మూడు వందేభారత్ రైళ్లు, మెట్రో ఎల్లో మార్గాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ విజయంలో బెంగళూరు కూడా భాగస్వామి అని తెలిపారు. ఉగ్రవాదుల స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. మౌలిక సౌకర్యాలు మరింత అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టామని అన్నారు. మౌలిక సౌకర్యాల కల్పనలో బెంగళూరు రోల్‌మోడల్‌గా నిలిచిందని కొనియాడారు. ప్రపంచంలో భారత్ మూడో అతి పెద్ద మెట్రో నెట్‌వర్క్ కలిగి ఉందని తెలిపారు.
భారత్ వేగవంతమైన అభివృద్ధిని నమోదు చేస్తోందని ప్రధాని (PM Modi) పేర్కొన్నారు. 2014లో భారత్‌లో కేవలం 74 విమానాశ్రయాలే ఉన్నాయని.. ప్రస్తుతం ఆ సంఖ్య 160కి చేరిందని తెలిపారు. ఆరోగ్యం విద్యా రంగాల్లో కీలక మార్పులు తీసుకువచ్చామని.. త్వరలో భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోందని ధీమా వ్యక్తం చేశారు.