ఆసియా కప్ 2025లో భాగంగా జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఓపెనర్లు అభిషేక్ శర్మ(31), శుభ్ మన్ గిల్(10)లు శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్(47 నాటౌట్), తిలక్ వర్మ(31)లు రాణించడంతో భారత్ 15.5 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 131 పరుగులు చేసింది. దీంతో పాక్ పై భారత జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన న పాకిస్తాన్ ను కుల్దీప్ యాదవ్ దెబ్బ కొట్టాడు. పాక్ బ్యాట్స్ మెన్లలో సాహిబ్‌జాదా ఫర్హాన్(40) రాణించగా.. చివర్లలో బౌలర్ షహీన్ ఆఫ్రీది సిక్సులతో రెచ్చిపోయాడు. కేవలం 16 బంతుల్లో నాలుగు సిక్సులతో అజేయంగా 33 పరుగులు చేశాడు. దీంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఇక, భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు.. బుమ్రా, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలు ఒక్కో వికెట్ తీశారు.