Monday, September 8, 2025

ఆసియా కప్ హాకీ విజేత భారత్

- Advertisement -
- Advertisement -

ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణకొరియాపై ఘన విజయం
4-1 తేడాతో హర్మన్ సేన గెలుపు
హాకీ ప్రపంచ కప్ టోర్నీకి అర్హత సాధించిన టీమిండియా
ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తరువాత విజేతగా నిలిచిన భారత్

రాజ్‌గిర్: హాకీ ఆసియా కప్-లో భారత్ ఛాంపియన్‌గా అవతరించింది. ఆదివారం తుదిపోరులో డిఫెండింగ్ చాంఫియన్ దక్షిణ కొరియాను చిత్తు చేసి విజేతగా నిలిచింది టీమిండియా. దీంతో 2026 జిగిగే హాకీ వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించింది భారత్. ఎనిమిదేళ్ల అనంతరం కప్ కొట్టిన టీమిండియాకు ఇది నాలుగో అసియా కప్. ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో జోరుతో ఫైనల్లో అడుగు పెట్టిన టీమిండియా అదే జోరు ఫైనల్లో రాణించింది. ఫైనల్లో 4-1 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాను చిత్తు చేసింది. తొలి నుంచి ఏకపక్షంగా రాణించిన భారత్ హాకీలో అత్యంత విజయవంతమైన జట్టైన కొరియాపై ఫైనల్ పోరులో ఇండియా అధిపత్యం చెలాయించింది. పదే ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడికి దిగింది. ఆట ప్రారంభమైన నిమిషంలోనే సుఖ్జీత్ రివర్స్ హిట్‌తో అద్భుతమైన గోల్ సాధించడంతో ఇండియా గోల్స్ వేట ప్రారంభమైంది.

అనంరతం ప్రత్యర్థి జట్టు నుంచి ప్రతిఘటన ఎదురైనా టీమిండియా వెనకడుగు వేయలేదు. దీంతో ఫస్ట్ ఆఫ్ ముగిసే సమయానికి 28వ నిమిషంలో దిల్‌ప్రీత్ గోల్ సంధించడంతో 2-0 అధిక్యంలోకి దూసుకెళ్లింది భారత్. ఆ తర్వాత 45వ నిమిషంలో మరో అద్భుతమైన గోల్‌తో దిల్‌ప్రీత్ ఇండియాను 30లోకి తీసుకెళ్లాడు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ అందించిన బంతిని దిల్ ప్రీత్ గోల్ గా మలిచాడు. ఇక, ఆట చివర్లో 50వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను అమిత్ రోహిదాస్ డ్రాగ్ ఫ్లిక్ తీసుకొని గోల్ సాధించాడు. దీంతో భారత్ 4-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అనంరతం ప్రత్యర్థి జట్టు ఎటాకింగ్ మొదలు పెట్టినా నిర్ణీత సమయం ముగిసే వరకూ టీమిండియా వారిని నలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News