ముల్లాన్‌పూర్: మహిళల వన్డే ప్రపంచకప్‌కి ముందు టీం ఇండియా మహిళ జట్టు (India Women) స్వదేశంలో ఆస్ట్రేలియా జట్టుతో తలపడుతోంది. ఇరు దేశాల మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా ముల్లాపూర్‌లో జరిగిన తొలి వన్డేలో భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 282 పరుగుల విజయలక్ష్యాన్ని ఆసీస్ ముందుంచింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఓపెనర్లు ప్రతీకా రావల్ (64), స్మృతి మంధాన(58) ఇద్దరు అర్థశతకాలతో తొలి వికెట్‌కి 114 పరుగుల భాగస్వామ్యాన్న జోడించారు. అయితే ఆ తర్వాత కొంతసమాయినకే వీరిద్దరు ఔట్ అయ్యారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన హర్లీన్ డియల్ (54) అద్భమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రిత్ 11, జెమిమా రోడ్రిగ్స్ 18 ఎక్కువగా పరుగులు చేయలేకపోయారు. చివర్లో రాధా యాదవ్ 19, రిచా ఘోష్ 25, దీప్లి శర్మ 20 నాటౌట్ల మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ (India Women) 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది.
Also Read : ఓవైపు ‘బాయ్‌కాట్’ ట్రెండ్.. ఆటగాళ్లకు గంభీర్ సలహా ఇదే..