Friday, May 16, 2025

ఇంగ్లాండ్‌తో 5 టీ20లు, 3 వన్డేలు.. భారత జట్ల ప్రకటన

- Advertisement -
- Advertisement -

భారత మహిళల క్రికెట్ జట్టు జూన్‌లో ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్.. ఇంగ్లాండ్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ క్రమంలో గురువారం టీ20, వన్డే సిరీస్ లకు రెండు వేర్వేరు జట్లను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ) ప్రకటించింది. రెండు జట్లకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్ గా వ్యవహరించనుంది. ఆమె సారథ్యంలో 15 మంది సభ్యుల టీ20, వన్డే జట్లను వెల్లడించారు. స్మృతి మంధానను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు.

దాదాపు ఏడు నెలల తర్వాత ఓపెనర్ షఫాలి వర్మ T20 జట్టులోకి తిరిగి వచ్చింది. అయితే, ఆమెను వన్డే జట్టులోకి మాత్రం ఎంపిక చేయలేదు. ముంబై ఆల్‌రౌండర్ సయాలి సత్ఘారే కూడా తిరిగి జట్టులోకి వచ్చింది. మహిళల బిగ్ బాష్ లీగ్ సమయంలో మణికట్టు గాయం కారణంగా గత నవంబర్ నుండి దూరంగా ఉన్న వికెట్ కీపర్-బ్యాటర్ యాస్టికా భాటియాను రెండు జట్లకు ఎంపిక చేశారు. ఇటీవల శ్రీలంకలో జరిగిన ట్రై-సిరీస్‌లో అత్యంత వేగంగా 500 పరుగులు చేసిన బ్యాట్స్‌ ఉమెన్‌గా చరిత్ర సృష్టించిన యువ ఓపెనర్ ప్రతీకా రావల్ వన్డే జట్టులోకి సెలెక్ట్ చేశారు. ఇంగ్లాండ్ పర్యటనను భారత్ టీ20 సిరీస్ తో ప్రారంభించనుంది. జూన్ 28న ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఇరుజట్ల మధ్య తొలి టీ20 జరగనుంది.

జట్ల వివరాలు:

టీ20 జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), స్మృతి మంధాన (విసి), షఫాలి వర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికె), యాస్తికా భాటియా (వికె), హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ్, అమంజోత్ కౌర్, క్రియాలి సృంధతి రెడ్డి, క్రియాలి సృంధతి రెడ్డి.

వన్డే జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (c), స్మృతి మంధాన (vc), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (wk), యాస్తికా భాటియా (wk), తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చారణి, శుచి ఉపాధ్యాయ్, కె అరుంధయ కధ్యాయ్, కె అరుంధా గతి రెడ్డి, కె. సత్ఘరే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News