Sunday, May 4, 2025

షూటింగ్‌లో భారత్‌కు రెండో స్వర్ణం

- Advertisement -
- Advertisement -

India won 2nd gold medal

కైరో: ఈజిప్టు రాజధాని కైరో వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ పోటీల్లో భారత్ రెండో స్వర్ణ పతకాన్ని గెలుచుకొంది. గురువారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగం ఫైనల్లో భారత బృందం విజయం సాధించి పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఇషా సింగ్, పి.నివేత, రుచిత వినర్కర్‌లతో కూడిన భారత మహిళా జట్టు 166 తేడాతో జర్మనీకి చెందిన టీమ్‌ను ఓడించింది. ఆరంభం నుంచే భారత టీమ్ పూర్తి ఏకాగ్రతను ప్రదర్శించింది. సమన్వయంతో ఆడుతూ లక్షం దిశగా అడుగులు వేసింది. చివరి వరకు ఏకాగ్రతను నిలుపుకుంటూ విజేతగా నిలిచి స్వర్ణం సొంతం చేసుకుంది. ఈ ప్రపంచకప్‌లో భారత్‌కు ఇది రెండో పసిడి పతకం కావడం విశేషం. అంతకుముందు పురుషుల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ సౌరభ్ చౌదరి స్వర్ణం సాధించాడు. ఇక మహిళల పది మీటర్ల విభాగంలో భారత్‌కు చెందిన తెలుగుతేజం ఇషా సింగ్ రజత పతకాన్ని సాధించింది. తాజాగా టీమ్ విభాగంలో ఇషా సింగ్ స్వర్ణం సొంతం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News