Friday, August 15, 2025

బెంగాల్ లేకుంటే ఇండియాకు స్వాతంత్య్రం వచ్చేదే కాదు

- Advertisement -
- Advertisement -

ఒకవేళ పశ్చిమ బెంగాల్ లేకుంటే భారత్‌కు స్వాతంత్య్రం వచ్చేదే కాదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. రవీంద్రనాథ్ టాగోర్, సుభాష్ చంద్రబోస్ వంటి ప్రముఖులు భారత దేశానికి ఓ దశాదిశా నిర్దేశం చేశారన్నారు. వారంతా బెంగాల్‌లోనే పుట్టారన్నారు. ఆమె ‘కన్యాశ్రీ’ 12వ వార్షికోత్సవం వేడుకలో ప్రసంగిస్తూ దేశ భిన్నత్వంలో ఏకత్వంకు బెంగాల్ ఓ ఆశాకిరణమైందన్నారు. ‘బెంగాల్ లేకుంటే ఇండియాకు స్వాతంత్య్రం వచ్చేదే కాదు. బెంగాల్ నేలపైన రవీంద్రనాథ్ టాగోర్, నజ్రుల్ ఇస్లాం, సుభాష్ చంద్ర బోస్ వంటి ప్రముఖులు జన్మించారు. జాతీయ గీతం, ‘జై హింద్’ నినాదాన్ని అందించిందే బెంగాలీలు’ అన్నారు.

బిజెపి పాలిత రాష్ట్రాలలో బెంగాలీ మాట్లాడే వలస కార్మికులపై ‘భాషా ఉగ్రవాదం’ దాడులు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) ‘బెంగాలీ అస్మిత(గౌరవం)’ కాపాడే ప్రచారంలో ముందుంది అన్నారు. ‘స్వాతంత్య్ర దినోత్సవం నాడు సంకుచిత భావాలు వీడండి. భిన్నత్వంలో ఏకత్వం, సామరస్యానికి బెంగాల్ నిలబడుతుంది. మనం ఐక్యంగా ఉంటేనే జాతి బలంగా ఉంటుంది’ అన్నారు. ‘ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృ భాషని మరచిపోరాదు. కన్యాశ్రీ పథకం కింద 93 లక్షల మంది ప్రయోజనం పొందారు. ఈ పథకం బాల్య వివాహాలను నిరోధిస్తుంది. వచ్చే ఏడాది ఈ పథకం కోటి దాటుతుంది. కన్యాశ్రీ పథకం ద్వారా బడులు మానేసేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News