Saturday, May 17, 2025

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత సైన్యానికి రూ. 50 వేల కోట్ల ప్రోత్సాహం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:  ఆపరేషన్ సిందూర్ ను విజయవంతంగా నిర్వహించిన సైనిక దళాలకు చక్కటి ప్రోత్సాహం లభించింది. భారతదేశ రక్షణ బడ్జెట్ ను ఏకంగా రూ. 50 వేల కోట్లు పెంచనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అనుబంధ బడ్జెట్ రూపంలో అందించే ఈ మొత్తం వల్ల రక్షణ కేటాయింపులు రూ.7 లక్షల కోట్లు దాటుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2024-2026 బడ్జెట్ లో సాయుధ దళాలకోసం రికార్డు స్థాయిలో రూ. 6.81 లక్షల కోట్లు కేయాయించారు. ఈ ఏడాది కేటాయింపులు 2024-25 బడ్జెట్ కేటాయింపులతో చూస్తే 9.2 శాతం పెరిగింది. అప్పట్లో రూ. 6.22 లక్షల కోట్లు కేటాయించారు. పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లో పెరిగిన రక్షణ బడ్జెట్ కు ప్రభుత్వం ఆమోదం కోరుతుంది. ఈ మొత్తాన్ని అభివృద్ధి ఆయుధాల కొనుగోలు ఇత ర పరికరాల కొనుగోలుకు వినియోగించే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News