Monday, May 26, 2025

ఉగ్రవాదులను లోపలికి చొరబడి కొడుతాం: ఎంపి శశి థరూర్

- Advertisement -
- Advertisement -

సిందూర్‌పై అమెరికాలో థరూర్ బృందం

న్యూయార్క్ : పాకిస్థాన్ కేంద్రీకృత ఉగ్రవాదంపై ఉపేక్ష ఉండదు. దెబ్బకు గట్టి దెబ్బ బారతదేశ విధానం అని కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి ఇతర చర్యలు, భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఎంపీల బృందాలు పర్యటిస్తున్నాయి. ఇందులో భాగంగా థరూర్ నాయకత్వపు బృందం ఆదివారం అమెరికాలో మీడియాతో మాట్లాడింది. పహల్గాం ఉగ్రదాడి తరువాతి క్రమంలో రివాజు మారింది దెబ్బకు దెబ్బ , మరింత గట్టి దెబ్బ తప్పదని భారత్ రుజువు చేసిందని ఈ కీలక ఎంపిల బృందం నేత థరూర్ తెలిపారు.

పాక్‌లో కూర్చోవడం, ఇండియాలో ఉగ్రదాడులకు పాల్పడటం, అమాయకులను చంపివేయడం, తమకేమీ కాదని తప్పించుకుందామంటే ఇక కుదరదు. ఉగ్రదాడులకు పాల్పడ్డ వారు ఎక్కడున్నా , వారిని పసిగట్టి , వారిని ఎంచుకుని దెబ్బ తీయడం ఇప్పటి మన పంథా అయిందని థరూర్ తెలిపారు. ఉగ్రవాదం ఎంచుకుని పౌరుల ప్రాణాలతో సయ్యాటకు దిగాలని అనుకుంటే అటువంటి వారు ఇక మూల్యం చెల్లించుకోవాల్సిందే అని థరూర్ తెలిపారు. థరూర్ సారధ్యపు ఎంపిల బృందం అమెరికా సహా బ్రెజిల్, కొలంబియా, బ్రెజిల్, గియనా, పనామా, కొలంబియాలలో పర్యటిస్తుంది. పాకిస్థాన్ ఉగ్ర వైఖరిని ఎండగట్టేందుకు భారతదేశ విశ్వ యత్నాల్లో భాగంగా ఎంపిల బృందాలు ఖరారు అయ్యాయి. న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ంఎపిల బృందం కొందరు నిర్ణీత ఎన్‌ఆర్‌ఐ ప్రముఖులతో ఇష్టాగోష్టిగా మాట్లాడింది.

చర్యకు ప్రతిచర్య కటువుగా ఉంటుందనేది ఇప్పుడు శత్రువుకు తెలిసివచ్చేలా చేశామని థరూర్ తెలిపారు. పాక్‌లో తిష్టవేసుకోవడం , దాడులు సాగించడం , తాము భద్రం అనుకునే వీరికి ఇవి కాలం చెల్లేరోజులే అవుతాయని హెచ్చరించారు. భారత్ ఏ చర్యను ముందుగా ఆరంభించదు. అయితే ఎదుటి పక్షం ఏదైనా చేపడితే ఇందుకు ప్రతిగా సమాధానం గట్టిగానే ఉంటుందని ఆపరేషన్ సిందూర్‌తో తేటతెల్లం అయిందని కాంగ్రెస్ పెద్దల అధికారిక సమ్మతి లేకుండానే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపిల బృందానికి నాయకత్వం వహిస్తున్న థరూర్ తెలిపారు.

పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులకు ఇప్పుడు తొలిసారి సరైన సందేశం వెలువరించడం జరిగిందని తెలిపారు. ఉగ్రవాదులు ఆరంభించారు, దీనికి భారత్ ధీటుగా స్పందించింది. 88 గంటల నిడివి యుద్ధంలో ఏం జరిగిందనేది అందరికీ తెలుసునని చెప్పారు. థరూర్ బృందంలో జెఎంఎం ఎంపి సర్ఫరాజ్ అహ్మద్, టిడిపి నుంచి గంటి హరీష్ గంటి మాధుర్ బాలయోగి, బిజెపికి చెందిన సుశాంక్ మని త్రిపాఠీ, బిజెపికే చెందిన భువనేశ్వర కల్తియా ఇతరులు ఉనానరు. ఈ ఎంపీల బృందం శనివారం ఇక్కడికి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News