న్యూఢిల్లీ: పహల్‌గామ్‌లో ఉగ్రవాదులు చేసిన దాడి ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టిన ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేసింది. ఈ దాడిలో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. దీనిపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. భారత క్రికెటర్లు ఈ దాడికి మద్ధతిస్తూ.. సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. మాజీ క్రికెటర్లు.. ప్రస్తుత ఆటగాళ్లు ఈ ఆపరేషన్‌పై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
అందులో కొన్ని పోస్ట్‌లు
‘భయం లేని ఐక్యత.. అవధులు లేని బలం.. ఇండియాకు దేశ ప్రజలే కవచం. ఈ ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదు. మనమంతా ఒకటే టీం’ – సచిన్ టెండూల్కర్
‘మీ మీద ఎవరైనా రాయి వేస్తే.. వాళ్లపై పూలు వేయండి.. కానీ కుండీతో పాటు.. జై హింద్’..‘ధర్మో రక్షతి రక్షితః.. భారత సేనకి జై’ – వీరేంద్ర సెహ్వాగ్.
‘ఎల్లవేళలా మద్దతు నిలుస్తాం. జై హింద్’ – ఆకాశ్ చోప్రా
‘జై హింద్’ – గౌతమ్ గంభీర్
‘భద్రత విషయంలో భారత్ ఏ మాత్రం రాజీ పడదు. ఇది సమాధానం కాదు.. సందేశం’ – చేతన్ శర్మ
ఇలా చాలా మంది ప్రస్తుత, మాజీ క్రికెటర్లు ఆపరేషన్ సింధూర్‌కి మద్ధతు తెలుపుతున్నారు. పహల్‌గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడంతో ఆ దాడి బాధితులు భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.