ఆసియా కప్ 2025 తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో భారత్ మూడు వన్డేలు, ఐదు టి-20ల్లో (Ind VS Aus) తలపడుతుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ వన్డే సిరీస్‌లో అడే అవకాశం ఉండటంతో ఫ్యాన్స్ ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సిరీస్ జరిగే ఎనిమిది వేదికలలో ఇండియన్ ఫ్యాన్ జోన్స్ టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. సిడ్నీ, కాన్‌బెర్రాలోని టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
‘‘సిరీస్ (Ind VS Aus) ప్రారంభానికి ఇంకా 50 రోజులు ఉండగానే భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే మూడు వన్డేలు, ఐదు టి-20లకు సంబంధించి ఇండియన్ ఫ్యాన్స్ టికెట్లు అమ్ముడుపోయాయి. ఫ్యాన్స్ నుంచి వచ్చిన విశేష స్పందనకు ధన్యవాదాలు’’ అని క్రికెట్ ఆస్ట్రేలియా పోస్ట్ చేసింది. ఈ సిరీస్ విషయానికొస్తే.. అక్టోబర్ 19వ తేదీన పెర్త్ వేదికగా మొదటి వన్డే, 23న అడిలైడ్‌లో రెండో వన్డే, 25న ఎస్‌సిజి వేదికగా మూడో వన్డే జరుగుతాయి. ఆ తర్వాత అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8వ తేదీ వరకూ ఐదు టి-20 మ్యాచ్‌ల్లో ఇరు జట్లు తరపడతాయి.
Also Read : కీలక నిర్ణయం తీసుకున్న ద్రవిడ్.. ఆ జట్టు కోచ్ పదవికి గుడ్‌బై