కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. రోజుకో ఘటన వెలుగులోకి వస్తుంది. కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ మెనేజ్‌మెంట్ చదువుతున్న విద్యార్థినిపై మరో విద్యార్థి అత్యాచారం చేశాడు. ఓ విద్యార్థిని మానసికంగా కృంగిపోవడంతో ఆమె స్నేహితుడు కౌన్సిలింగ్ ఇస్తానని రమ్మని కబురు పంపాడు. విద్యార్థిని బాయ్స్ హాస్టల్‌కు వెళ్లిన తరువాత మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఆమెకు స్నేహితుడు ఇచ్చాడు. ఆమె స్పృహ కోల్పోయిన తరువాత ఆమెపై అతడు అత్యాచారం చేశారు. ఆమెకు స్పృహ వచ్చిన తరువాత తనపై అఘాయిత్యం జరిగిందని తెలుసుకొని అతడిని ప్రశ్నించింది. ఈ విషయం బయట చెబితే చంపేస్తానని బెదిరించాడు. వెంటనే ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కోల్‌కతాలోని ఓ జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నెల రోజుల క్రితం న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం విధితమే.
కోల్‌కతాలో ఐఐఎం విద్యార్థినిపై అత్యాచారం
- Advertisement -
- Advertisement -
- Advertisement -