Saturday, July 12, 2025

బతుకుదెరువు కోసం దుబాయికి..అనారోగ్యంతో మృతి

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ జిల్లా, ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామానికి చెందిన నీరడి భోజన్న (45) బతుకుదెరువు కోసమని 15 రోజుల క్రితం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. అక్కడ మృత్యువు అతనిని అనారోగ్యంతో కాటేసింది. తమ ఇంటి పెద్ద మృత్యువాత పడిన విషయాన్ని విన్న కుటుంబ సభ్యులు రోదనలతో విలపిస్తున్నారు. మృతునికి భార్య, కూతురు ఉన్నారు. మృతుడి తల్లి రోదిస్తూ దేశం కాని దేశంలో అనారోగ్యంతో మరణించిన తమ కొడుకు మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎంఎల్‌ఎ డాక్టర్ భూపతిరెడ్డి చొరవ చూపాలని వేడుకొంది. మృతుడు ఆర్థిక పరిస్థితుల వల్లనే దుబాయ్ బాట పట్టాల్సి వచ్చిందని అతని భార్య రోదిస్తూ తెలిపింది.. ప్రభుత్వం స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేసేవిధంగా సహకరించాలని కుటుంబ సభ్యులు వేడుకొంటున్నారు. కాగా, ఇందల్వాయి మాజీ సర్పంచ్ బాధిత కుటుంబ ఆర్థిక పరిస్థితులను చూసి 5 వేల రూపాయలు విరాళంగా అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News