Sunday, May 18, 2025

భారత్ క్షిపణి దెబ్బలు తిన్నాం

- Advertisement -
- Advertisement -

పాక్ ప్రధాని షెహబాజ్ ఒప్పుకోలు
ఇస్లామాబాద్: ఇటీవలి ఆపరేషన్ సిందూర లో భాగంగా తమ దేశం భారతదేశపు క్షిపణుల దాడిలో తమ కీలక వైమానిక స్థావరాలు ధ్వంసమైనట్లు పాకిస్థాన్ అంగీకరించింది. దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తొలిసారిగా శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. తమ వౌమానిక స్థావరాలకు ఎటువంటి ముప్పు జరగలేదని ఇంతకాలం పాక్ సైన్యం, నాయకత్వం చెపుతూ వచ్చింది అయితే ఇందుకు భిన్నంగా షరీఫ్ అధికారిక ప్రకటన వెలువడింది.

భారత్ క్షిపణుల దెబ్బ భరించాల్సి వచ్చిందని, తమ దేశ కీలక వైమానిక స్థావరాలు ధ్వంసం అయ్యాయని ఆయన తెలిపారు. ఈ నెల పదవ తేదీన ఉదయ ంపూట నమాజులు ముగించుకుని తరువాత ఈతకు వెళ్లానని ఈ దశలో తన సెక్యూర్డ్ ఫోన్ మోగిందని , తనకు సైనిక ప్రధానాధికారి జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్ ఫోన్ చేశారని గుర్తు చేసుకున్నారు. దేశంలోని కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌ను టార్గెట్‌గా చేసుకుని భారతదేశ అత్యంత శక్తివంతమైన క్షిపణుల దాడి జరిగింది.ఈ వైమానిక స్థావరం పరిసరాల్లోని కనుమలలోనే అత్యంత రహస్యంగా పాక్ అణ్వాయుధాలు దాచి ఉంచారని వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ నిల్వలకు ఏమైనా ముప్పు వాటిల్లిందా లేదా అనేది ప్రస్తావించకుండా పాక్ ప్రధాని క్షిపణి దాడులు జరిగాయి. వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయని వివరించారు.

తెల్లవారుజామున తనకు దాడి గురించి సమాచారం అందిందని తెలిపారు. భారత క్షిపణి దాడులను తిప్పికొట్టేందుకు చైనా ఆయుధ సంపత్తితో పాటు స్వదేశీ పరిజ్ఞానపు రక్షణవ్యవస్థలను వాడామని చెప్పారు. అయితే వైమానిక స్థావరాలకు ఏ మేరకు నష్టం వాటిల్లిందనేది చెప్పలేదు. సమీపంలో అణు స్థావరాలపై దాడి జరిగినట్లు, అక్కడ రేడియేషన్ జరిగి, స్థానికుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతున్నట్లు వచ్చిన వార్తలపై ప్రధాని స్పందించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News