జోరందుకున్న యుద్ధ విమానాల విన్యాసాలు యుపిలోని గంగా ఎక్స్‌ప్రెస్ హైవేపై రాఫెల్,
మిరాజ్2000, మిగ్29 యుద్ధ విమానాలతో ఉధృతంగా విన్యాసాలు అరేబియా
సముద్రంలో యుద్ధ నౌకల భీకర విన్యాసాలు పోటీగా భారీస్థాయిలో డ్రిల్స్ నిర్వహించిన
పాక్ రక్షణశాఖ అప్రమత్తం గుజరాత్ తీరం వెంబడి హై
అలర్ట్ భారత్‌లో పాక్ ప్రధాని యూట్యూబ్‌పై వేటు టెర్రరిస్టుల ఏరివేతలో పాక్
ఇండియాకు సహకరించాలి :అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ హితవు ఉగ్రవాదులతో
బంధం నిజమే : అంగీకరించిన పాక్ మంత్రి బిలావల్ భుట్టో రెండు నెలల ఆహారం నిల్వ
చేసుకోండి : పిఒకె ప్రజలకు అధికారుల సూచన
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: విస్తారిత అరేబియా మ హాసముద్రం వేదికగా ఇప్పుడు భారత్ , పాకిస్థాన్ మధ్య శుక్రవారం తీవ్రస్థాయి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారతదేశపు అత్యంత కీలకమైన ఎకనామిక్ జోన్ (ఇఇజడ్) సముద్ర జలాల్లో పెద్ద ఎత్తు న విన్యాసాలు సాగించారు. ఇది ఇప్పుడు ఆరం భం అయిందని, పలు స్థాయిల్లో వీటిని ఇకపై నిర్వహిస్తారని నౌకా దళ అధికారి ఒక్కరు తెలిపా రు. అ యితే ఈ విన్యాసాలు పాకిస్థాన్‌కు తగు రీతిలో జ వాబు చెప్పేందుకేనా ? లేక సాధారణ ప్రక్రియలో భాగమా అనేది ఈ వర్గాలు వెల్లడించలేదు. ఇటీవలి కాలంలో భారతీయ నౌకాదళం విశేష రీతిలో తమ పోరాట పటిమను పెంచుకునేలా ఆయుధాలను, అత్యంత అధునాతన నౌకల ను వార్‌హెడ్స్‌ను, జ లాంతర్గాములను, విమానాలను సంతరించుకుం ది. వీటి సామర్థాన్ని పరీక్షించుకుంటూ ఇప్పుడు పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నడుమ పలు రకాల విస్యాసాలకు దిగుతున్నారు. నౌకాదళ సంబంధిత బహు ళ స్థాయి నౌకలు, యాంటి ఎయిర్‌క్రాఫ్ట్ దాడుల డ్రిల్స్ నిర్వహించినట్లు వెల్లడించారు.
గుజరాత్ తీరం వెంబడి హై అలర్ట్
ప్రత్యేకించి గుజరాత్ తీర ప్రాంతానికి సమీపంలో భారతీయ తీర ప్రాంత దళాలు సర్వం సమాయత్తం అయ్యాయి. ముఖ్యంగా ఫార్వర్డ్ ఏరియాలలో నిఘా పెంచారు. కోస్ట్ గార్డు బలగాలు ఇప్పు డు నౌకాదళంతో పూర్తి సమన్వయంతో వ్యవహరిస్తున్నాయి. ఇక పాకిస్థాన్ సైనిక దళాలు ప్రత్యేకిం చి నౌకా వైమానిక బలగాలు అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రాంతాలను ఎంచుకుని సైనిక విన్యాసాలను ఉ ధృతం చేశాయని భారతీయ నిఘా వర్గాలకు సమాచారం అందింది. కరాచీ కేంద్రీకృతంగా ఎక్కువగా ఈ డ్రిల్స్ నిర్వహించారు. అయి తే పాక్ సైన్యం కదలికలను భారత ఇంటలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటున్నా యి. ఇందుకు తగు విధంగా తీర ప్రాంతాల్లో ని ఘా సమాచారం తీవ్రతరం అయింది.