Friday, July 18, 2025

భారత ఓపెనర్‌కు షాకిచ్చిన ఐసిసి.. భారీ జరిమానా..

- Advertisement -
- Advertisement -

భారత మహిళల జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. అతిథ్య జట్టులో భారత్ ఐదు టి-20లు, మూడు వన్డేల్లో తలపడుతోంది. టి-20 సిరీస్‌ని 3-2 తేడాతో కైవసం చేసుకున్న భారత్, ఇంగ్లండ్‌‌తో జరిగిన తొలి వన్డేలోనూ విజయం సాధించింది. అయితే తొలి వన్డేలో టీం ఇండియా ఓపెనర్ ప్రతిక రావల్‌కు (Pratika Rawal) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో ఆమె దురుసుగా ప్రవర్తించిన కారణంగా భారీ జరిమానా విధించింది.

అసలేం జరిగిందంటే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేధనలో భారత ఓపెనర్ ప్రతిక (Pratika Rawal) 36 పరుగులు చేసింది. అయితే సోఫీ ఎక్లెస్టోన్ బౌలింగ్‌లో ప్రతిక క్లీన్ బౌల్డ్ అయింది. దీంతో సహనం కోల్పోయిన ఆమె బౌలర్ సోఫీని భుజంతో ఢీకొట్టింది. అంతేకాక.. మరో బౌలర్ లారెన్ ఫైలర్‌తో దురుసుగా ప్రవర్తించింది. దీంతో ఇది లెవల్-1 నేరంగా పరిగణించిన ఐసిసి ఆమెకు మ్యాచ్ ఫీజు నుంచి 10 శాతం కోత, ఒక డీమెరిట్ పాయింట్ విధించింది.

అంతేకాక.. ఇంగ్లండ్‌కి కూడా ఈ మ్యాచ్‌లో జరిమానా పడింది. స్లో ఓవర్‌ రేటు కారణంగా ఇంగ్లండ్‌ జట్టు సభ్యులకు మ్యాచ్ ఫీజు నుంచి 5 శాతం కోత విధించింది. ఇక తొలి వన్డేలో దీప్తి శర్మ (62) అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో వన్డే జూలై 19న లార్డ్స్ వేదికగా జరుగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News