Sunday, August 3, 2025

అధ్యాత్మిక కేంద్రానికి వెళ్తుండగా.. అమెరికాలో నలుగురు అదృశ్యం..

- Advertisement -
- Advertisement -

భారత సంతతికి చెందిన నలుగరు సీనియర్ సిటిజన్లు అమెరికాలో (America) అదృశ్యమయ్యారు. పశ్చిమ వర్జినియాలోని ఓ ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. చివరిగా వాళ్లు ఆచూకీ పెన్సిల్వేనియాలోని బర్గర్‌కింగ్ రెస్టారెంట్ వద్ద గుర్తించారు. అదృశ్యమైన వాళ్లు ఆశా దివాన్(85), కిశోర్ దివాన్(89), శైలేష్ దివాన్(86), గీతా దివాన్‌(84) అని తెలుస్తోంది. న్యూయార్క్‌లోని బఫెల్లో నుంచి మార్షల్ కౌంటీలోని ప్రభుపాదా పాలెస్‌కి కారులో ఈ కుటుంబసభ్యులు వెళ్లారు. చివరిసారిగా జూలై 29న పెన్సిల్వేనియాలోని బర్గర్‌కింగ్ రెస్టారెంట్‌కి ‌వద్ద వాళ్లు వెళ్లినట్లు, అక్కడ క్రెడిట్ కార్డును ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు.

ఆ నలుగురి ఆచూకీ కోసం పోలీసులు (America) గాలిస్తున్నారు. అందుకోసం హెలికాఫ్టర్లను కూడా రంగంలోకి దింపారు. ఈ ఘటనపై కౌన్సిల్ ఆఫ్ హెరిటేజ్ అండ్ ఆర్ట్స్‌ ఆఫ్ ఇండియా కూడా స్పందించింది. ఆ నలుగురు సురక్షితంగా ఉన్నారనే వార్త కోసం ఎదురుచూస్తున్నామని తెలిపింది. అదృశ్యమైన వారి ఫోటోలను ఓ సంస్థ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఆచూకీ తెలిసిన వాళ్లు సమాచారం ఇవ్వాలని కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News