Sunday, August 3, 2025

అమెరికాలో అదృశ్యం కథ విషాదాంతం.. నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలో (America) అదృశ్యమైన భారత సంతతీకి చెందిన నలుగురు సీనియర్ సిటిజన్లు మృతి చెందారు. పశ్చిమ వర్జీనియాలోని ఓ ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్లున్న వాళ్ల కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో ఆ నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు నిర్ధారించారు. బాధితులు ఒకే కుటుంబానికి చెందిన ఆశా దివాన్(85), కిశోర్ దివాన్(89), శైలేష్ దివాన్(86), గీతా దివాన్‌(84)లుగా గుర్తించారు. వీరు న్యూయార్క్‌లోని బఫెల్లో నుంచి మార్షల్ కౌంటీలోని ప్రభుపాదా పాలెస్‌కి కారులో ఈ కుటుంబసభ్యులు బయలుదేరారు. (America)

అయితే బిగ్ వీలింగ్ క్రీక్ రోడ్డులో వీరి వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. జూలై 29న వీరి వాహనం అదృశ్యం అయింది. పెన్సిల్వేనియాలోని బర్గర్‌కింగ్ రెస్టారెంట్‌లో వీరి వాహనం చివరిసారిగా కనిపించింది. అక్కడే వాళ్లు చివరిసారిగా క్రెడిట్ కార్డును ఉపయోగించినట్లు తెలిసింది. వీరి ఆచూకీ కోసం పోలీసులు హెలికాఫ్టర్లు కూడా ఉపయోగించారు. కాగా.. ఆగస్టు 2 రాత్రి వాహనాన్ని పోలీసులు గుర్తించారు. ఆ నలుగురు చనిపోయినట్లు గుర్తించిన పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News