టెక్సాస్: ఆమెరికాలో మరో భారత సంతతికి(Indian Origin) చెందిన వ్యక్తిని హత్య గురయ్యారు. టెక్సాస్‌లోని ఆస్టిన్ ప్రాంతంలో మరో భారతీయుడు అతన్ని బస్సులో హత్య చేశాడు. హెల్త్-టెక్ స్టార్టప్ కంపెనీ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న భారత సంతతికి (Indian Origin) చెందిన అక్షయ్ గుప్తా.. మే 14వ తేదీన ఓ బస్సులో ప్రయాణిస్తుండా.. వెనక కూర్చున్న మరో భారతీయుడు దీపక్ కండేల్ దాడి చేసి అతన్ని హతమార్చాడు. అధికారులు వెంటనే స్పందించి గుప్తాను ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు.
ఎలాంటి గొడవ జరగకపోయినా.. జరగకపోయినా.. కండేల్ దాడి చేసినట్లు సిసిటివి దృశ్యాల ద్వారా బయటపడింది. వాటి ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు అతనికపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, అక్షయ్ గుప్తా తన మామలా కనిపించడం వల్లే అతనిని కత్తితో పొడిచానని కండేల్ చెప్పడం గమనార్హం. పెన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పూర్టి చేసిన అక్షయ్ ఇటీవల తన కొత్త ప్రాజెక్టు కోసం మైక్రోసాఫ్ సిఇవొ సత్యనాదెళ్లను కలిశారు.