మన తెలంగాణ/హైదరాబాద్ : రైల్వే బోర్డు కీ లక నిర్ణయం తీసుకుంది. రైల్వే చార్జీల పెంపు, టికెట్ బుకింగ్‌లో నిబంధనల అమలుకు సం బంధించి ఆదేశాలు జారీ చేసింది. సోమవా రం అర్థరాత్రి నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయని వెల్లడించింది. కొత్త చార్జీలతో పాటు, తత్కాల్ టికెట్ బుకింగ్ లో ఆధార్ త ప్పనిసరి చేశారు. సెకండ్ క్లాస్ ఆర్డినరీకి 500 కిలోమీటర్ల వరకు సాధారణ చార్జీలే ఉండనున్నాయి. 501 కిలోమీటర్ల నుంచి 1500 కిలోమీటర్ల వరకు టికెట్‌పై రూ.5 పెంచారు. 1501 కి.మీ.నుంచి 2500 కి. మీల వరకు టి కెట్ పై రూ. 10, 2501 కి.మీల నుంచి 3 వేల కిలోమీటర్ల వరకు టికెట్ పై రూ. 15 పెం చా రు. ఆర్డినరీ స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఆర్డినరీ టికెట్లపై కిలోమీటర్ కు అర పైసా, మెయిల్ లేదా ఎక్స్ ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ టికెట్లపై కిలోమీటర్ కు ఒక పైసా పెంచారు.
నాన్ ఏసీ ఫస్ట్, సెకండ్ క్లాస్, స్లీపర్ టికెట్లపై కిలోమీటర్ కు ఒక పైసా చొప్పున పెంచారు. అన్ని రకాల రైళ్లలో ఎసి అన్ని తరగతులకు కి. మీకు 2 పైసలు చొప్పున పెంచారు. ఈ మార్పులు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. అన్ని జోన్ల మేనేజర్లకు రైల్వే బోర్డు సర్క్యూలర్ జారీ చేసింది. రిజర్వేషన్ చార్జ్, సూపర్ ఫాస్ట్ సర్ చార్జీల్లో మార్పు ఉండదని, ఇప్పటికే రిజర్వేషన్ చేసిన టికెట్లకు పెంచిన చార్జీలు అమలు కావని రైల్వే బోర్టు స్పష్టం చేసింది. రోజువారి ప్రయాణీకుల ప్రయోజనాల దృష్టా సబర్బన్ రైళ్ల చార్జీలు, నెలవారి సీజన్ టికెట్‌లలో ఎటువంటి మార్పులు చేయలేదని పేర్కొన్నారు. రాజధాని, శతాబ్ది, దురంతో, వందేభారత్, తేజస్, హమ్‌సఫర్, అమృత్ భారత్, మహామాన, గతిమాన్, అంత్యోదయ, జన్ శతాబ్ది, యువ ఎక్స్‌ప్రెస్, ఎసి విస్టాడోమ్ కోచ్‌లు, అనుభూతి కోచ్‌లు, ఆర్డినరీ నాన్ సబ్ అర్బన్ సర్వీసులు వంటి ప్రీమియర్, ప్రత్యేక రైలు సర్వీసులకు సైతం చార్జీల సవరణ వర్తిస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.