Friday, July 11, 2025

ఐదేళ్లలో వెయ్యి కొత్త రైళ్లు..2027 నాటికి బుల్లెట్ రైలు

- Advertisement -
- Advertisement -

వచ్చే ఐదేళ్లలో కొత్తగా వెయ్యి రైళ్లను పట్టాలు ఎక్కించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం మాట్లాడుతూ రానున్న ఐదేళ్లలో ఈ కొత్త రైల్వే సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. 2027 నాటికి దేశంలో బుల్లెట్ రైలు ప్రారంభించడమే భారతీయ రైల్వే లక్షంగా పెట్టుకుందని వివరించారు. రైల్వే ఎగుమతుల ద్వారా ప్రపంచం లోనే భారత్ కీలక పాత్ర పోషించనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రైల్వే ద్వారా సరకు రవాణా కారణంగా భారీగా ఆదాయం సమకూరనుందని చెప్పారు. ఇది దేశ వ్యవస్థకు ఊతం ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత 11 ఏళ్లలో దేశ వ్యాప్తంగా 35 వేల కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్‌ను నిర్మించామని వివరించారు. ఇది జర్మనీ దేశం లోని మొత్తం రైల్వే ట్రాక్‌తో సమానమని తెలిపారు.

ఒక్క ఏడాది లోనే 5300 కిలోమీటర్ల మేర ట్రాక్‌ను భారతీయ రైల్వే నిర్మించిందని తెలిపారు. ఏడాదిలో 30 వేల వ్యాగిన్లు, 1500 లోకోమోటివ్‌లను భారతీయ రైల్వే తయారు చేస్తుందని , ఇది ఉత్తర అమెరికా, యూరప్ తయారు చేస్తున్న రైల్వే వ్యాగన్ల కంటే అధికమని వివరించారు. మరోవైపు భారతీయ రైల్వేలో పెట్టుబడులు రూ. 2 వేల కోట్ల నుంచి రూ. 2.25 లక్షల కోట్లు ఎగబాకాయని , అందులో రూ.20 వేల కోట్లు … పీపీపీ ద్వారా అదనంగా వచ్చాయని వివరించారు. జపాన్ సహకారంతో బుల్లెట్ రైలు తయారు చేస్తున్నామని, ఇది 2026 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నామని తెలిపారు. 2027లో దీనిని ప్రారంభిస్తామన్నారు. ఇక ఏడాదిలో రైళ్లు పట్టాలు తప్పిన సంఘటనలు 170 నుంచి 30 కి తగ్గాయని తెలిపారు. మొత్తంగా పరిశీలిస్తే రైలు ప్రమాదాలు 80 శాతం మేర తగ్గాయని వివరించారు. ట్రాకులు అప్‌గ్రేడ్ చేయడం, పాయింట్స్, సిగ్నలింగ్ వ్యవస్థలను ప్రతిరోజూ సమీక్షించడం ద్వారా ఈ ప్రమాదాలు నివారించడం సాధ్యమైందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News