- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: ఇండియన్ రింగ్ టెన్నిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకు చెందిన కె.ఆర్.వి. శ్యామ్‌సుందర్ ఎన్నికయ్యారు. దీర్ఘకాలం పాటు జాతీయ టెన్నికాయిట్ ఛాంపియన్‌గా ఉన్న శ్యామ్ సుందర్ కోచ్‌గా, యోగా గురువుగా మంచి పేరు తెచ్చుకున్నారు. 64 ఏళ్ల శ్యామ్‌సుందర్ వివిధ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ టెన్నికాయిట్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు. కాగా, తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన ఇండియన్ రింగ్ ఫెడరేషన్ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. రజిత్ కుమార్ కాలా (రాజస్థాన్)ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
- Advertisement -