Saturday, August 2, 2025

సెమీస్‌లో లక్షసేన్, తరుణ్

- Advertisement -
- Advertisement -

మకావు: ప్రతిష్ఠాత్మకమైన మకావు ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు(Indian shuttlers) లక్షసేన్, తరుణ్ మన్నెపల్లిలు సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు. అయితే పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీకి క్వార్టర్ ఫైనల్లోనే చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ జోడీ మలేసియాకు చెందిన చుంగ్ హాన్ జియాన్, హైకల్ మహ్మద్ జంట చేతిలో ఓటమి పరాజయం పాలైంది. చుంగ్ జోడీ 2114, 1321, 2220 తేడాతో సాత్విక్ జంటను ఓడించింది. తొలి సెట్‌లో చుంగ్ జంట ఆధిపత్యం చెలాయించింది.

దూకుడుగా ఆడుతూ (Playing aggressively) ఎలాంటి ప్రతిఘటన లేకుండానే సెట్‌ను దక్కించుకుంది. కానీ రెండో గేమ్‌లో సాత్విక్ జోడీ చెలరేగి ఆడింది. అద్భుత ఆటతో అలరించిన సాత్విక్ జంట అలవోకగా సెట్‌ను సొంతం చేసుకుంది. ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో ఇరు జంటలు సర్వం ఒడ్డి పోరాడాయి. కానీ ఆఖరు వరకు ఆధిక్యాన్ని కాపాడు కోవడంలో సఫలమైన చుంగ్ జోడీ సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుని సెమీస్‌కు చేరుకుంది. ఇక పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ ఆటగాడు లక్షసేన్ క్వార్టర్ ఫైనల్లో చెమటోడ్చి నెగ్గాడు. చైనా షట్లర్ జువాన్ చెన్ జుతో జరిగిన హోరాహోరీ పోరులో లక్షసేన్ 2114, 1821, 2114 తేడాతో జయకేతనం ఎగుర వేశాడు.

ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనా చివరి వరకు నిలకడైన ఆటను కనబరిచిన లక్షసేన్ మ్యాచ్‌ను గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లాడు. మరో క్వార్టర్ ఫైనల్లో యువ ఆటగాడు తరుణ్ మన్నెపల్లి విజయం సాధించాడు. చైనా ఆటగాడు హు జితో జరిగిన ఉత్కంఠభరిత సమరంలో మన్నెపల్లి 2112, 1321, 2118తో హును ఓడించాడు. తొలి సెట్‌లో మన్నెపల్లి అలవోకగా నెగ్గాడు. కానీ రెండో సెట్‌లో అతనికి చుక్కెదురైంది. మూడో సెట్‌లో కూడా హు, మన్నెపల్లి సర్వం ఒడ్డి పోరాడారు. కానీ 75 నిమిషాల పాటు జరిగిన సమరంలో చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న మన్నెపల్లి విజయం సాధించి సెమీస్ బెర్త్‌ను సొంతం చేసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News