Monday, June 30, 2025

వివాహం కోసం అమెరికాకు వెళ్లిన భారతీయ యువతి అదృశ్యం

- Advertisement -
- Advertisement -

వివాహం కోసం అమెరికాకు వచ్చిన 24 ఏళ్ల భారతీయ యువతి అదృశ్యమైంది. ఆమె పేరు సిమ్రాన్ సిమ్రాన్. అమెకు ఇంగ్లీషు భాష తెలియదు. బంధువులు కూడా ఎవరు వెంటలేరు.అమెరికా లో కూడా ఆమెకు తెలిసిన బంధువులు ఎవరూ లేరని తెలిసింది. జూన్ 20న భారతదేశం నుంచి న్యూజెర్సీకి చేరిన కొద్ది సేపటికే సిమ్రాన్ చివరిసారిగా కన్పించారు. లిండెన్ వోల్డ్ పోలీసులు నిఘా ఫుటేజ్ లో ఆమె తన ఫోన్ ను తనిఖీ చేస్తున్నట్లు, ఎవరికోసమో వేచి చూస్తున్నట్లు కన్పించింది.ఆమె దగ్గర ఉన్న ఫోన్ కూడా వైఫై తో పనిచేసే అంతర్జాతీయ ఫోన్ అని తెలిసింది. కాగా, ఆ వీడియోలో ఆమె బాధలో ఉన్నట్లు కన్పించలేదని అధికారులు తెలిపారు. సిమ్రాన్ న్యూజెర్సీకి వచ్చిన ఐదు రోజుల తర్వాత బుధవారంనాడు కనిపించకుండా పోయిందని పోలీసులు నిర్థారించారు.

ప్రాథమిక దర్యాప్తులో ఆమె కుదిర్చిన వివాహంకోసం అమెరికా వెళ్లినట్లు తేలిందని, ఆమె అదృశ్యం పై దర్యాప్తు చేస్తున్న అదికారులు తెలిపారు. ఆమెకు సంబంధించిన కాంటాక్ట్ నెంబర్లు కూడా తెలియకపోవడంతో ఇండియాలోని ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించలేకపోయారు. సిమ్రాన్ ఐదు అడుగుల,4 అంగుళాల పొడవుగా ఉంటారు. 68 కిలోలు బరువు ఉంటారు. చివరిగా వీడియోలో కనిపించినప్పుడు బూడిదరంగు స్వెట్ ప్యాంట్, తెల్ల టీషర్ట్ ధరించారు. చిన్న వజ్రాలు పొదిగిన చెవిపోగులు ధరించి కన్పించింది. సిమ్రాన్ ఆచూకీకి సంబంధించి ఏ సమాచారం ఉన్నా, న్యూజెర్సీలోని లిండెన్ వోల్డ్ పోలీసులను సంప్రదించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News