Thursday, August 28, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జనగామకు రెండవస్థానం

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వం నుంచి ప్రశంసపత్రం
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం
నిజమవుతున్న పేదల కల
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషాషేక్
మన తెలంగాణ/ జనగామ ప్రతినిధి: నిరుపేదలకు సొంత ఇళ్లను అందించే లక్షంతో అమలుచేస్తోన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జిల్లాలో వేగవంతంగా జరిగేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషిచేస్తున్నారని కలెక్టర్ రిజ్వాన్ భాషాషేక్ తెలిపారు. మొదటి విడతలో 71 శాతం, రెండో విడతలో 86 శాతం గ్రౌండింగ్ పూర్తి అయినందున ఈనెలలో రాష్ట్రస్థాయిలో జనగామ జిల్లా రెండో స్థానం దక్కిన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రశంసా పత్రం, ల్యాప్‌ట్యాప్‌ని గురువారం కలెక్టర్ తన చాంబర్‌లో పీడీ హోసింగ్ మాతృనాయక్‌కి అందజేశారు.

ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి మన జిల్లాను రాష్ట్ర స్థాయిలో మంచి స్థానంలో నిలబెట్టేందుకు ప్రజాప్రతినిధులు, మండల స్పెషల్ అధికారులు, హౌజింగ్ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఇంజనీరింగ్ ఎంపీవో, పంచాయతీ అధికారులు కృషిచేశారన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు నిర్మాణాల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఎప్పటికప్పుడు సందర్శించి లబ్దిదారులతో నిరంతరం మాట్లాడుతూ ఇసుక, మొరం తదితర సామాగ్రి నిర్ణీత ధరలకు అందేలా పర్యవేక్షణ చేస్తున్నారన్నారు.

జిల్లాలో మొత్తం మొదటి విడతలో 716 ఇల్లు మంజూరు కాగా 479 గ్రౌండింగ్ అయ్యాయని, రెండో విడతలో 5282 ఇల్లు మంజూరు అవ్వగా 4341 గ్రౌండింగ్ దశలో ఉన్నాయన్నారు. ఇందులో 269 బేస్‌మెంట్ లెవల్‌లో, గోడల దశలో 432, స్లాబ్ స్థాయికి 187 దశకి చేరుకున్నాయన్నారు. ఇందుకు గాను రూ.34.98కోట్లు లబ్దిదారుల ఖాతాలోకి ప్రభుత్వం జమ చేసిందన్నారు. మిగతా ఇళ్లు కూడా త్వరగా పూర్తి అయ్యేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని, ఇందుకు లబ్దిదారులు కూడా సహకరించి జిల్లాకి మంచి పేరు రావడానికి కృషిచేయాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News